శ్రియ కూతురు పేరు ఏంటో తెలుసా.. ఆ పేరుకి అర్థం తెలిస్తే షాక్ అవుతారు!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ‌ సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరితో నటించింది ఈమె. టాలీవుడ్‌లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించి ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. శ్రియ సినిమాల్లోకి అడుగుపెట్టి రెండు ద‌శాబ్దాలు పూర్త‌య్యాయి. 2001లో విడుద‌లైన ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సౌత్‌, బాలీవుడ్‌లోను సినిమాలు చేసి విజ‌యాల్ని అందుకుంది.

రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌మెన్ అయిన ఆండ్రీ కొశ్చీవ్‌ను ప్రేమించిన శ్రియ.. 2018లో అత‌డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె అప్పట్నుంచి ఆయనతో కలిసి ఫుల్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తు వచ్చింది. శ్రియ భర్తతో ఉన్న ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తున్నట్లు అభిమానులతో చెప్పుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ. పైగా ఎప్పటికప్పుడు అభిమానులతో తన బాగోగులు పంచుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది శ్రియ సరన్.

మరి కొన్ని రోజుల క్రితం స్పెయిన్‌లోని బార్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్కడికి వెకేషన్ కు వెళ్లిన శ్రియ దంపతులు.. లాక్ డౌన్ కారణంగా అక్కడే లాక్ అయిపోయారు. ఏడాది పాటు వాళ్లిద్దరూ అక్కడే ఉన్నారు. అదే సమయంలో పాపకు కూడా జన్మనిచ్చింది శ్రియ.

వెండితెరపై శ్రియా శరణ్ కథానాయిక. కానీ, నిజ జీవితంలో వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యం ఇచ్చే ఒక మహిళ. సినిమాల్లో నటించడంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శ్రియ ఇంపార్టెన్స్ ఇస్తు వస్తుంది. పాప కోసం టైమ్ ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అయితే ఆమె కొన్ని రోజుల వరకు తన కుమార్తె ముఖాన్ని కనపడనివ్వకుండా శ్రియ జాగ్రత్తలు పడ్డారు.

ఈ పాపకు రాధా అనే పేరు పెట్టిందనీ చెప్పుకుంటూ వచ్చింది శ్రియ. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఇప్పుడు తెలిపింది. తన భర్తది ర‌ష్యా అని.. రష్య‌న్‌లో రాధా అంటే సంతోషం అని అర్థం వస్తుంది అని చెప్పింది. అలాగే పాప పుట్టిందని విషయాన్ని తన అమ్మకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే రాధా రాణి వచ్చింది అంటూ చెప్పిందని.. అదే విషయం తన భర్తకు చెప్తే ఆ పేరు పెట్టేద్దాం అని చెప్పినట్లు తెలిపింది.

ఒకప్పుడు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన శ్రియ శరణ్‌ పెళ్లి తర్వాత క్రమంగా సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమైంది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టడంతో ఆమె సోషల్‌ మీడియాలో మళ్లీ యాక్టివ్‌ అయింది. ఆమె పేరు రాధ అని పెట్టడంతోపాటు తరచూ కూతురు ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేస్తూ ముచ్చట పడిపోయింది. గతంలో శ్రియా తన లిటిల్‌ ప్రిన్సెస్‌తో కలిసి బయటకు వెళ్లిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటుంది.

రెండేళ్ల కిందట పాప‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియ ప్ర‌స్తుతం కుటుంబ బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తూనే మ‌రోవైపు సినీ కెరీర్‌పై దృష్టిపెడుతోంది. డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తోంది. తొమ్మిదేళ్ల త‌ర్వాత క‌న్న‌డంలో ఆమె ఓ సినిమాను అంగీక‌రించి క‌బ్జా చిత్రంతో సాండల్‌వుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.