వామ్మో న్యూడ్ ఫోటో షేర్ చేసిన శ్రియ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్న నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ పలు కీలక పాత్రల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే శ్రియ వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్త కూతురుతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను అభిమానులతో పంచుకుని పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే శ్రియ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా శ్రియ ఓ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. అక్కడ ఎన్నో ఫోటో పెయింటింగ్స్ ఉండగా ఈమె మాత్రం అమ్మాయి వెనుతిరిగి ఉన్నటువంటి ఒక న్యూడ్ పెయింటింగ్ వద్ద నిలబడి ఫోటోలు దిగారు.ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఆర్ట్ గ్యాలరీ లో ఎన్నో పెయింటింగ్స్ ఉండగా శ్రీయ ఇలా న్యూడ్ పెయింటింగ్ ఉన్న ఫోటో దగ్గర ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో ఈమె పై పలువురు తమదైన శైలిలో కామెంట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.