కూతురు రాధకి చెవులు కుట్టించిన శ్రియా.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీస్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రియ తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, హింది భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన శ్రియ ఇప్పటికి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదిలా ఉండగా శ్రియ ఆండ్రీ కొశ్చీవ్ అనే రష్యాన్ టెన్నిస్ ప్లేయర్ తో కొంతకాలం ప్రేమలో ఉన్న శ్రియ 2018 లో అతనిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వీరిద్దరూ ఏంతో సంతోషంగా జీవిస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడ ఉంది. ఆ పాపకి శ్రియా రాధ అనే అచ్చమైన తెలుగు పేరు పెట్టుకుంది. శ్రియా తరచు తన భర్త, పాపతో కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కూడ శ్రియ తన కూతురి ఫోటోలు షేర్ చేసింది. అయితే తాజాగా శ్రియ తన కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వెనుక ఒక కారణం ఉంది.

ఇటీవల శ్రియ దంపతులు తమ కూతురు రాధకి చెవులు కుట్టించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను శ్రీయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో శ్రియ దంపతులు తమ కూతురితో కలిసి ఫోటో కి ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివాహం తర్వాత శ్రీయ కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా అక్షయ్ కుమార్ భార్యగా శ్రియా నటించింది. ఇక హిందీ సినిమా దృశ్యం 2 లో కూడా అక్షయ్ కుమార్ కి భార్యగా నటించింది. అంతేకాకుండా
కన్నడ స్టార్‌ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘కబ్జా’ సినిమాలో కూడా మధుమతి పాత్రలో నటించనుంది.