ఈషా రెబ్బా తెలుగు చలనచిత్ర నటిగా అందరికీ సుపరిచితమే. హైదరాబాదులో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో మోడలింగ్ లో ప్రవేశించింది. ఈమె మోడలింగ్ లో కొనసాగుతుండగా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుండి అడిషన్ కు రావాలని కాల్ వచ్చింది. ఈషా రెబ్బా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.
2013లో ‘అంతక ముందు ఆ తర్వాత’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇంకా దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఆమీతుమీ కూడా ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక 2018లో అవే చిత్రంలో లెస్సియన్ మహిళా పాత్రను పోషించింది. ఈ చిత్రం ద్వారా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. 2021లో ఒట్టు చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈమె నటనకు అవసరం అవుతాయని విలువిద్య, కిక్ బాక్సింగ్ లో నైపుణ్యం పొందింది.
ఇలా సినిమాల ద్వారా బిజీ లైఫ్ గడుపుతున్న ఈషా రెబ్బా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు సినిమా అవకాశాల గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ప్రస్తుతం తెలుగమ్మాయిలు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఒకరకంగా బాగానే వస్తున్నారని, తెలుగు బాగా మాట్లాడితే ఇక్కడ అంతగా పట్టించుకోరు. అదే బయటివారు వచ్చి తెలుగుతో అందరికీ నమస్కారం అని చెబితే క్లాప్స్, విజిల్స్ కొడతారు. టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎంకరేజ్ చేయడం మంచిదే కానీ మనవాళ్లకు కూడా కాస్త ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అని తన అభిప్రాయం అన్నట్టు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈషా రెబ్బా ఓ తమిళ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.