అల్లు అరవింద్ నటుడు కాకుండా నిర్మాత కావడానికి కారణం ఇదే!

అల్లు అరవింద్ తెలుగు సినీ నిర్మాత. ఇతను పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన కుమారుడు అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్ కెరియర్ ప్రారంభంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడం జరిగింది.

ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తాడు.1974లో విడుదలైన బంట్రోతు భార్య సినిమాను నిర్మించి.. నిర్మాతగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వరుస ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించడం జరిగింది. అందులో అభిలాష, విజేత, ప్రతి బంద్, పెళ్లి సందడి, గంగోత్రి, మగధీర, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

నిర్మాతగా అల్లు అరవింద్ బిజీగా రాణిస్తూ గతంలో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో ఆలీ తనను నటుడుగా కాకుండా నిర్మాణ రంగం వైపు వెళ్లడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు తన తండ్రి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువగా కానీ చూసుకునేవాడని చెప్పడం జరిగింది.

అప్పుడే తాను ఎంప్లాయ్ కాకుండా ఎంప్లాయర్ కావాలి అని అనుకోవడం జరిగిందని తెలిపాడు. ఇక సినిమాలలో నటించాలి అనే కోరికను అప్పుడప్పుడు చిన్న పాత్రలలో నటించి కోరిక తీర్చుకోవడం జరిగింది అని తెలిపాడు. ఇక రెండవ ప్రశ్నగా ఇంట్లో మనువడు, మనువరాలితో ఎలా గడుపుతారు అనే ప్రశ్న అడగడం జరిగింది.

అందుకు తాను అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చాలా తెలివైనదని, చిన్నతనంలో ఇంత తెలివి ఉన్న అమ్మాయిని ఎక్కడ చూడలేదని చెప్పడం జరిగింది. ఖాళీ సమయాలలో అల్లు అర్జున్ పిల్లలే తనకు టైం పాస్ అని తెలపడం జరిగింది.

ఇక అల్లు అరవింద్ 2020లో డిజిటల్ ఓటీటీ లోకి ప్రవేశించారు. ఓటీటీ లో ఆహా పేరుతో ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆహా ఓటీటీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే అల్లు రామలింగయ్య పేరు మీదుగా అల్లు స్టూడియోను ప్రారంభించడం జరిగింది.