వామ్మో.. ఇంతకాలం శర్వానంద్ ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

శర్వానంద్ తెలుగు చలనచిత్ర నటుడు. ఈయన 1984లో హైదరాబాదులో జన్మించాడు. తండ్రి వ్యాపారవేత. ఇతని చిన్ననాటి స్నేహితులు దగ్గుబాటి రానా, రామ్ చరణ్ తేజ. చిన్నప్పటినుండి సినిమాలలో నటించాలని కోరిక ఉంది. చదువును మధ్యలో ఆపేస్తాను అంటే తల్లి డిగ్రీ పూర్తి అయితేనే సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటాను అనే షరతుతో హైదరాబాదులోని వేస్లీ కాలేజీలో బీకాం పూర్తి చేశాడు.

తరువాత రోజు జూబ్లీహిల్స్ లో బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఆర్యన్ రాజేష్ సలహాతో ముంబైలో నటనలో శిక్షణ పొంది రెండు సంవత్సరాలు ప్రయత్నించిన ఫలితం శూన్యం. తరువాత వైజాగ్ లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతుండగా ఒక నిర్మాత, ఒక దర్శకుడు వచ్చి యాక్టింగ్ స్కూల్లో ఆడిషన్స్ జరిపి ఇతనిని హీరోగా సెలెక్ట్ చేశారు.

కానీ ఏ లాభం ఐదో తారీఖు సినిమా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. తరువాత అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. మొదటి సినిమాలో హీరోగా రెండో సినిమాలో హీరో ఫ్రెండ్ గా అవకాశం వచ్చింది. ఇలా అయితే నేను హీరో అవుతాను కాదు అని భ్రమలో ఉండేవాడు. తరువాత యువసేనలో నలుగురు హీరోలు చేయాల్సి ఉండగా అందులో ఒకరిగా శర్వానంద్ కు అవకాశం వచ్చింది.

మంచి హిట్ అయింది తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఒక పాత్ర, సంక్రాంతి, లక్ష్మి సినిమాలలో తమ్ముడి పాత్ర, రాజు మహారాజు సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించాడు. ఆ తర్వాత వెన్నెల సినిమాలో అవకాశం వచ్చి తన నటనను ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత అడపాదడపా అవకాశాలు రావడంతో సక్సెస్ కాలేను అని అభిప్రాయం లో ఉండగా గమ్యం సినిమాతో తన ఆలోచనలు తారు మారయ్యాయి.

ఆ తరువాత వచ్చిన ప్రస్థానం సినిమా మంచి విజయం, గుర్తింపు తీసుకొచ్చి ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలి. గమ్యం సినిమాను రీమిక్స్ చేస్తే అది కూడా విజయం సాధించింది ఆ తర్వాత వచ్చిన శతమానం భవతి సినిమా కూడా మంచి విజయం సాధించి పెట్టింది. దాదాపు 50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం.