నీకు సినిమాలు ఎందుకు.. అవకాశాలు కోసం వెళ్తే త్రివిక్రమ్ ఈ మాట మాట్లాడారు: సుబ్బరాజు

సుబ్బరాజు తెలుగు చలనచిత్ర నటుడు. ఇతను తెలుగు, తమిళ భాషలలో నటించాడు. సుబ్బరాజు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించాడు. బాహుబలి లో కుమార వర్మ పాత్రను పోషించినందుకు జపాన్ లో విపరీతమైన ప్రజాధరణ పొందాడు. సుబ్బరాజు విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని డెల్ లో కంప్యూటర్స్ లో హార్డ్వేర్ ఉద్యోగం చేసేవాడు.

దర్శకుడు కృష్ణవంశీ యొక్క పర్సనల్ కంప్యూటర్ రిపేర్ కావడంతో కృష్ణవంశీ అసిస్టెంట్ సుబ్బరాజును రిపేరు చేయమని కోరాడు. అలా కృష్ణవంశీ ఇంటికి వెళ్లిన సుబ్బరాజును చూసి కృష్ణవంశీ గారు ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. ఈ పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుబ్బరాజు.

ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఆనంద్ గా నెగటివ్ రోల్ లో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇక వరుస అవకాశాలతో విభిన్న పాత్రలు పోషిస్తూ తనదైన శైలిలో ఇండస్ట్రీలో రాణించాడు. ఇక ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఫుల్ టైం నటించడం ప్రారంభించి సంవత్సరానికి ఐదారు సినిమాలలో నటిస్తూ మంచి కేర్ సంపాదించుకున్నాడు.

ఇక తమిళం, కన్నడ, హిందీలో కూడా ఆఫర్స్ రావడంతో అక్కడ కూడా తన నటన నిరూపించుకున్నాడు. ఇలా తన నటనతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సుబ్బరాజు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఇంటర్వ్యూలో తనకు చదువుకునే సమయంలో ఎలా ఉండేవారు అనే ప్రశ్న ఎదురైంది. అందుకు సుబ్బరాజు తాను ఎక్కువగా సైకిళ్లపై, బైక్ పై ఎక్కువగా తిరిగే అలవాటు ఉండేదట. ఇంటికి లేటుగా వచ్చిన సమయంలో ఇంట్లో వాళ్లకు ఫ్రెండ్ కు బాగా లేకపోతే వెళ్లాను అని చిన్నచిన్న అబద్ధాలు చెప్పి మేనేజ్ చేసే వాళ్ళని చెప్పడం జరిగింది.

సుబ్బరాజు డిగ్రీ చదివే సమయంలోనే తనకు త్రివిక్రమ్, నటుడు సునీల్ బాగా తెలుసు అని చెబుతూ, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇద్దరు ఐదు ఆరు సంవత్సరాల పాటు బాగా కష్టపడ్డారని తెలిపాడు. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఎన్నో త్రివిక్రమ్, సునీల్, తన జీవితంలో ఉన్నాయని తెలిపాడు.

ఒకసారి త్రివిక్రమ్ ను కలవాడని వరుసగా మూడు రోజులు ఆఫీస్కు వెళితే మూడవరోజు ఒక అర్ధగంట కూర్చోబెట్టుకుని సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం. ఒకవేళ వస్తే కంటిన్యూగా రాణించాలని అంటే ఇంకా కష్టం అని చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశంలో త్రివిక్రమ్ పడ్డ స్ట్రగుల్స్ తాను పడకూడదని ఆలోచించుకోమని చెప్పాడని పేర్కొనడం జరిగింది.