కమెడియన్ రాజబాబు ఆస్తి కోల్పోవడానికి అసలు కారణం ఇదే!

రాజబాబు తెలుగు పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు హాస్యనటుడిగా ఒక వెలుగు వెలిగాడు. ఈయన 1935లో పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం లో జన్మించాడు. శతాబ్దపు హాస్యనటునిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. ఈయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని టీచర్ గా పని చేసేవాడు.

ఉపాధ్యాయునిగా చేసేటప్పుడు పలు నాటకాలలో పాలుపంచుకోవడం జరిగింది. 1965 లో లక్ష్మి అమ్ములు ను వివాహం చేసుకున్నాడు. వీరికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు సంతానం. సినిమాలలో నటించాలి అనే కోరిక వల్ల మద్రాస్ కు వెళ్లాడు డబ్బులు లేక అవస్థలు పడుతూ చివరికి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు.

మరోవైపు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అడ్డాల నారాయణరావు గారు సమాజం అనే సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తరువాత పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ 350 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. తరువాత అవకాశాలు బాగా వచ్చి అంతస్తులు సినిమా ద్వారా ఏకంగా 1300 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా విడుదలయ్యే ప్రతి చిత్రంలో రాజబాబు నటించిన జరిగింది.

ఎన్నో సేవా కార్యక్రమాలలో పలు పంచుకొని దానధర్మాలు చేశాడు. రాజమండ్రిలో చెత్త శుభ్రం చేసే వారికి దానవాయిపేట లో ఉన్న తన భూమిని దానం చేశాడు. కోరుకొండలో జూనియర్ కళాశాల నిర్మిస్తే దానికి రాజబాబు కళాశాల అని పేరు పెట్టారు. ఈయన స్వయంగా కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు. అందులో రోడ్డున పడ్డాడు అనే సినిమా పరాజయం పాలయ్యింది. అందరూ రాజబాబుపై అసూయతో ఈ సినిమాతో రాజబాబు రోడ్డున పడ్డాడని ఆనందపడ్డారు.

రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం. మహాశివరాత్రి, ఇంకా ఘంటసాల వర్ధంతి రోజున పాటలు వింటుంటే గొంతులో కాస్త నొప్పిగా ఉంటే హైదరాబాదులోని తెరిసా హాస్పిటల్ లో చేరి 1983 ఫిబ్రవరి 14న కన్నుమూశారు. అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి స్వర్గస్తుడయ్యాడు.