నటుడు వరుణ్ సందేశ్, వితిక లకు పిల్లలు లేకపోవటానికి అసలు కారణాలు ఇవేనట!

వరుణ్ సందేశ్ ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని విద్యాభ్యాసం అంతా అమెరికాలో కొనసాగింది. తన సహనటి వితికను ప్రేమించి, కుటుంబ సభ్యుల సహకారంతో వివాహం చేసుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమా కోసం శేఖర్ కమ్ముల నటన పోటీలు పెట్టినప్పుడు అందులో పాల్గొని హ్యాపీడేస్ చిత్రంలో చందు పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ సినిమా విజయం పొందిన తర్వాత వరుసగా అవకాశాలు రావడం ప్రారంభం అయింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం సినిమా కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న రెండు, మూడు సినిమాలు తప్ప మిగతా సినిమాలు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి.

నటుడుగా వరుణ్ సందేశ్ అనుకునంత సక్సెస్ సాధించలేదు అని చెప్పుకోవచ్చు. వరుణ్ సందేశ్.. యాప్ టీవీ వారు నిర్మించిన హే కృష్ణ అనే వెబ్ సిరీస్ లో కషిష్ వోహ్రా సరసన నటించాడు. ఈయన 2019లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులను అలరించడం జరిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ కు పెళ్లి తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసుకోలేదా అనే ప్రశ్న ఎదురయింది.

అందుకు వరుణ్ సందేశ్, వితిక ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిందని, ఆ ఛానల్ బాగానే పాపులర్ అయ్యింది అని తెలిపాడు. ఇంకోపక్క కోవిడ్ కూడా ఉండడం చేత ముందు కెరీర్ లో తాను రాణించాలని అందుకే పిల్లల విషయం కాస్త పక్కన పెట్టినట్లు పేర్కొనడం జరిగింది.

ఇక ఆ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అనే ప్రశ్నకు బదులుగా తమపై రకరకాల కామెంట్స్ వచ్చాయని, రోజుకు ఒక గంట ప్రసారమయ్యే షో ద్వారా వ్యక్తి క్యారెక్టర్ డిసైడ్ చేయలేమని తెలిపాడు. తమపై వచ్చిన కామెంట్స్ ద్వారా వితికా చాలా డిప్రెషన్ కు లోను అయిందని తెలుపుతూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా బిజీగా ఉంటూ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు తెలుపడం జరిగింది.