సద్దాం హుస్సేన్ పటాస్ షో కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. ఈయన 1995లో కర్నూలులోని ఆర్లగడ్డ లో జన్మించారు. వీరిది ఒక నిరుపేద ముస్లిం కుటుంబం. వీళ్ళ నాన్న కష్టపడితేనే పూట గడిచేది. సద్దాంకు చదువుపై కాస్త శ్రద్ధ ఉండేది కాదు చిన్నప్పటినుండే సినిమాలు చూస్తూ సొంతంగా మిమిక్రీ ప్రాక్టీస్ చేసేవాడు.
ఇక విద్యాభ్యాసం అంత ఆర్లగడ్డలోని కొనసాగింది. ఎలాగైనా సినిమాలలో నటించాలి అని హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో ఉండి అవకాశాల కోసం తిరిగేవాడు. ఇతనితో చాలామంది అవకాశాలు ఇస్తామని స్క్రిప్ట్ రాపించుకోవడం, నీ దగ్గర ఉన్న డబ్బులను వాడుకోవడం, వాళ్లకు కావాల్సిన పనులు చేయించుకోవడం లాంటివి చేసి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేశారు.
ఎంత ప్రయత్నించిన అవసరాలకు వాడుకునే వారే కానీ అవకాశం మాత్రం ఇచ్చేవారు కాదు ఇలాగైతే కష్టం వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ నటన అంటే ప్రీతితో ఇంకాస్త ప్రయత్నాలు చేద్దాం అంటూ జబర్దస్త్ షో కూడా ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇక పటాస్ షో కు ఆడిషన్స్ జరుగుతుండగా స్వతహాగా వెళ్లి మొదటి అడిషన్ తోనే స్టేజిపై తన టాలెంట్ను చూపించుకున్నాడు. ఇక ఆ షోలో చేస్తూ లో వచ్చే చిన్నచిన్న అవకాశాలను వాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు.
తరువాత అదిరింది షోలో కామెడీ పండించి నవ్వించాడు. పలు టీవీ షోలలో కూడా పాలుపంచుకుంటున్నాడు. మొదట్లో అయితే ఒక ఈవెంట్ కు 1200 పారితోషకం తీసుకునేవాడు. ప్రస్తుతం అయితే 12000 నుండి 15000 వరకు పారితోషకం తీసుకుంటున్నాడు. ఇక పలుషన్లో అయితే 20వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈయన దగ్గర రెండు లగ్జరీ కార్లు, రెండు లగ్జరీ బైక్లు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మణికొండ లో ఒక అపార్ట్మెంటును రెంటుకు తీసుకొని ఉంటున్నాడు. మొత్తానికి రెండు నుండి రెండున్నర కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది.