నగ్మా సినీనటి, భారతీయ రాజకీయ నాయకురాలు. ఈమె అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. 1974లో ముంబైలో జన్మించింది. వీరి రాజరిక నైపథ్యం గల కుటుంబానికి చెందినవారు. వీళ్ళ కుటుంబీకులు వ్యాపారవేతలు. షిప్పింగ్, ఫార్మాసిటికల్, వస్త్ర, వ్యవసాయ పరిశ్రమలు ఉండేవి. ఈమె తల్లి స్వాతంత్రోద్యమకారుల కుటుంబానికి చెందినది. నగ్మా తల్లిదండ్రులు 1969లో వివాహం చేసుకొని 1974లో విడిపోయినట్టు తెలుస్తుంది.
తర్వాత నగ్మా తల్లి,చందన్ సదనహ్ ను వివాహం చేసుకుంది. ఆయన ఒక సినీ నిర్మాత ఈయనకు రోషిణి, జ్యోతిక సంతానం. నగ్మా తండ్రి తనతో మరణించే వరకు సన్నిహితంగా ఉండేవాడని 2005లో చనిపోవడం జరిగిందని, నేను గౌరవ కుటుంబానికి చెందిన దానిని గర్వపడుతున్నాను. నా తల్లి, నా తండ్రి అయిన అరవింద్ ని ముంబైలోని సి. సి. ఐ కబ్ లో చట్టబద్ధంగా పెళ్లి చేసుకుందని చెప్పింది. సినిమాల వైపు రావడానికి తల్లి ప్రోత్సాహమే కారణం.
ఈమె 2000 సంవత్సరంలో వస్త్ర దుకాణంను ప్రారంభించి 2003లో తండ్రి అనారోగ్యం చెందడంతో దుకాణాన్ని మూసివేసి, తండ్రి మరణించే వరకు దగ్గరుండి అన్ని చూసుకుంది.నగ్మా సినీ ప్రస్థానాన్ని ఏ రెబల్ ఆఫ్ లవ్ అనే హిందీ చిత్రం ద్వారా సల్మాన్ ఖాన్ సరఫరా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా విజయం సొంతం చేసుకుంది. ఇలా సినిమా రంగంలో దూసుకుపోతూ తెలుగు తెరకు కూడా పరిచయమయి చిరంజీవితో చేసిన ఘరానా మొగుడు ఇంకా అక్కినేని నాగార్జున తో అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్ చిత్రాలు గుర్తింపు తెచ్చాయి.
1994 లో విడుదలైన భాషా చిత్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. తాను నటించాలనుకున్నది ఒకటి ప్రేక్షకులు కోరుకునేది మరొకటి అని భావించి సినిమాలను నటించడం ఆపేసి రాజకీయాల వైపు అడుగు వేసింది. భారత జాతీయ కాంగ్రెస్ లోచేరి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. తరువాత ఇండో ఆసియన్ సర్వీస్ రిపోర్టు ప్రకారం ఆమె సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోకసభ స్థానానికి బిజెపి నుండి పోటీ చేసినట్లు తెలుస్తుంది. నా తల్లి ముస్లిం, నా తండ్రి హిందువు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ తెలిపింది. 2009లో జనరల్ లోకసభ ఎన్నికలకు ఆమె తన సీటు కోసం తీవ్రమైన వివాదాలు ఎదుర్కొంది.