హీరో కిరణ్ అబ్బవరం సంపాదించిన ఆస్తులు ఇవేనట..!

కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. ఈయన 2019లో రాజావారు రాణి వారు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈయన 1990లో కడప జిల్లాలోని రాయచోటిలో జన్మించాడు. వీరిది ఒక నిరుపేద కుటుంబం. ఇతని అన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. కిరణ్ బీటెక్ వరకు చదువుకొని బెంగళూరులో జాబ్ చేసేవాడు.

తను చదువుకుంటున్న సమయంలో హాస్టల్లో ఉండేవాడు. తన అన్న కష్టపడి హాస్టల్ ఫీజు, కాలేజీ ఫీజులు కట్టేవాడు. ఒక్కోసారి తల్లి కూలి పనికి కూడా వెళ్లేది. కిరణ్ కు సినిమాలలో నటించాలని ఆసక్తి ఉండడంతో ఎలా ప్రయత్నించాలో తెలియదు, సినీ ఇండస్ట్రీలో పరిచయం ఉన్నవారు ఎవరూ లేరు. కొత్తవారికి అవకాశం రావాలంటే చాలా కష్టం.

ఎలాగైనా నటించాలని ఆలోచనతో మొదట తనే సొంతంగా కథలు రాసుకొని బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ షార్ట్ ఫిలింలలో నటించేవాడు. అలా 2015 నుండి షార్ట్ ఫిలింలో నటిస్తూ మంచి రొమాంటిక్ కథలు కావడంతో కాస్త పాపులర్ అయ్యి తర్వాత రాజావారు రానివారు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఈ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత ఎస్. ఆర్ కళ్యాణ మండపంలో నటించడం జరిగింది. తర్వాత సెబాస్టియన్ పి. సి. 524 లో రేచీకటి ఉన్న కానిస్టేబుల్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సమ్మతమే సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే షార్ట్ ఫిలింలు స్వయంగా తానే నిర్మించుకునేవాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మొదటి రెండు సినిమాలకు దాదాపు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఇక ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు గాను 35 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సమ్మతమే సినిమాకు దాదాపుగా 40 లక్షలకు పైగానే పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో కథకు కూడా పారితోషకం తీసుకున్నాడని సమాచారం. దాదాపుగా నాలుగు నుండి ఐదు కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తుంది.