బాలయ్య సినిమా గురించి అసలు విషయాలు బయటపెట్టిన తమన్.. అలా ఉంటుందంటూ!

ఎస్. తమన్ తెలుగు సినీ సంగీత దర్శకుడుగా అందరికీ సుపరిచితమే. ఈయన పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్. తెలుగు సినిమాల ద్వారా ఎస్ తమన్ పిలువబడుతున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో సంగీత దర్శకుడిగా పనిచేయడం జరిగింది.

1994 లో వచ్చిన భైరవద్వీపం సినిమా ద్వారా అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 2003లో బాయ్స్ సినిమాలో తొలిసారిగా నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత గుర్తింపు పొంది తమిళ, కన్నడ, తెలుగు భాషలలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

తనకు తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా జి ఆనంద్ సంగీత బృందంలో రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ గా పనిచేయడం జరిగింది. మణిశర్మ ను తన గురువుగా భావిస్తాడు. ఈయనతో కలిసి దాదాపుగా 8 సంవత్సరాల కాలంలో 94 చిత్రాలలో పని చేయడం జరిగింది.

మొత్తం 14 సంవత్సరాల వ్యవధిలో సంగీతంపై పూర్తి పట్టు సాధించాడు. ఇక సినిమాలలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్. బి. కె 107 గురించి తమన్ ఏమన్నాడంటే.. ఈ చిత్రం మామూలుగా కాకుండా వేరే లెవల్ లో ఉంటుందని చెప్పడం జరిగింది.

ఇందులో బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని తెలిపాడు. ఒక్కో యాక్షన్స్ సన్నివేశానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదని ప్రేక్షకులకు సినిమా చూస్తే పూనకం వస్తుందని చెప్పడం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందని.. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పడం కష్టమని తెలపడం జరిగింది.

తమన్ తక్కిలి అనే సంగీత బృందాన్ని కలిగి ఉన్నాడు. ఇతను ఆహా లో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.