టాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.. అదే తేడా అంటూ!

తాప్సీ ఒక భారతీయ నటి. ఈమె ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళ భాషలలో నటించింది. ఈమె రెండు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈమె తన కెరీర్ ను మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. తరువాత 2010లో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

మొదటి సినిమాతోనే తన నటనకు గుర్తింపు పొంది సినిమా విడుదల కాకముందు నుంచే సినీ అవకాశాలు వచ్చాయి. తర్వాత తాప్సీ తమిళం, హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కూడా వరుస అవకాశాలతో తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాప్సీ 2018లో ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో 15.48 కోట్ల ఆదాయంతో 67వ స్థానంలో నిలిచింది.

2019లో 68వ స్థానంలో రెండవసారి ప్రదర్శింపబడింది. తాప్సీ 2019లో వై ది గ్యాప్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో పిల్లల ఆరోగ్యం ఇంకా లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇలా ఒక వైపు సినిమా రంగం రాణిస్తూ, మరొకవైపు సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న తాప్సీ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఆ ఇంటర్వ్యూలో తాప్సీ కు తెలుగు ఇండస్ట్రీపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించడం జరిగింది. అందుకు సమాధానంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. సినిమాలో ఎక్స్పోజింగ్ చేసినప్పుడు బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే అభిమానులు బాగా ఆదరిస్తారని తెలుపడం జరిగింది. మిగతా ఇండస్ట్రీల కంటే తెలుగు ఇండస్ట్రీలో ఒకసారి నటనలో గుర్తింపు పొందితే ఇక జీవితాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు అని చెప్పడం జరిగింది.

కానీ ఆమె హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలలో చాలా మంది అందమైన అమ్మాయిలను చూశానని, కారణం ఏంటో సరిగా తెలియదు కానీ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి పెద్దగా ఇష్టపడరు. అందువల్లనే బయటివారు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని తెలపడం జరిగింది.

తాప్సీ తన సోదరుడు ఇంకా స్నేహితురాలితో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.