రియల్ హీరో అనిపించుకున్న సుమన్.. ఇంతకు ఆయన చేసిందేంటంటే?

సుమన్ ఒక భారతీయ నటుడు. ఇతను ప్రధానంగా తెలుగు, తమిళ భాషలలో నటించడం జరిగింది. ఇతను 1980లలో తెలుగు సినిమా యొక్క అత్యంత ప్రముఖ నటులలో ఒకరిగా కొనసాగాడు. ఇతని పూర్తి పేరు సుమన్ తల్వార్ గౌడ్. 1979లో నీచల్ కులం అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించి రాణించాడు. దాదాపుగా 150 చిత్రాలలో నటించడం జరిగింది. తెలుగులో వెంకటేశ్వర, శివ ఇంకా రామ వంటి పౌరాణిక పాత్రలలో నటించాడు. ఇంకా ఈయన షోటోకన్ కరాటే సంస్థ నుండి కరాటేలో బ్లాక్ బెల్ట్ 1డాన్ సాధించిన సుమన్ ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడిగా కూడా కొనసాగడం జరిగింది.

ఇలా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్న సమయంలో 1985లో నీలి చిత్రాల నిర్మాణం స్కాంలో చిక్కుకొని నానా ఇబ్బందులు పడ్డాడు. చివరకు విజయవంతంగా ఆ స్కాం నుండి బయటపడడం జరిగింది. తర్వాత సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తనను కావాలనే ఇండస్ట్రీలో ప్రముఖులు తొక్కేశారని వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.

కొంతకాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలలో విభిన్న పాత్రలలో నటించడం ప్రారంభించాడు. రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్ర ద్వారా తిరిగి తన నటనకు పూర్వ వైభవం తెచ్చుకున్నాడు. 2021లో ”లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే” పురస్కారం అందుకున్నాడు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా మళ్ళీ బిజీగా గడుపుతున్న సుమన్ గతంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో తనను ఆర్మీ సైనికుల కోసం కొంత భూమిని ఆర్మీకి ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత అని ప్రశ్నించగా, ఆర్మీ సైనికులు 24 గంటలు దేశ రక్షణ కోసమే పోరాడుతారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలి అని మా కుటుంబమంతా కలిసి కొంత భూమిని ఆర్మీకి ఇవ్వాలి అనుకున్నాము.

ప్రస్తుతం ఆ భూమి కోర్టు తగాదాల మధ్యన ఉంది. ఆ భూమిలో మాకు ఎంత వస్తుందో అంతా ఆర్మీకే ఇచ్చేస్తామని పేర్కొనడం జరిగింది. దాదాపు 100 ఎకరాలకు పైగా ఉండే ఆ భూమి ఇలా దేశ రక్షణ చేసే సైనికులకు ఇవ్వడం ద్వారా సినిమాలోనే కాదు. నిజజీవితంలో కూడా గొప్ప హీరో అనిపించుకున్నారు సుమన్. ప్రస్తుతం ఈయన తన నటనకు గుర్తింపు తగ్గ పాత్రలు వస్తేనే నటించాలని అనుకున్నట్లు సమాచారం.