బెంగుళూరు వరద బాధితులకు ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్న సుడిగాలి సుధీర్..!

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. సుధీర్ తను చదువుకునే రోజుల్లోనే తన మామయ్య దగ్గర మ్యాజిక్ చేయడం నేర్చుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా వాళ్ళ అమ్మకు తెచ్చి ఇచ్చేవాడట. ఇక సుడిగాలి సుధీర్ చెప్పుదువుకునే రోజుల్లోనే భరతనాట్యం, జానపద బాగా నేర్చుకున్నాడు.

ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అవకాశాలు వెతకడం ప్రారంభించాడు. రామోజీ ఫిలిం సిటీ ఇంకా కొన్ని టీవీ షోలో గారడి విద్య ద్వారా డబ్బు సంపాదించి ఇంటికి పంపించేవాడు. అవకాశాలు రాకపోవడం మరోవైపు తండ్రికి యాక్సిడెంట్ అయిందన్న వార్తతో తిరిగి విజయవాడకు వెళ్ళిపోయాడు.

తండ్రికి ప్రమాదం తప్పింది. కానీ కుటుంబ భారమంతా సుధీర్ పై పడడంతో చేసేదేమీ లేక మళ్ళీ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. మ్యాజిక్ షోలు చేస్తూ ఉండగా మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోకు అవకాశం వచ్చింది. ఆ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు సుధీర్. ఇక జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

జబర్దస్త్ షోలో చేస్తూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించగా సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈయన జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఢీ, పోవే పోరా షోలు కూడా చేస్తున్నాడు. ఇక ఈయన హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు కూడా మంచి విజయం తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈయన బెంగుళూరు వరద బాధితులకు ఏకంగా 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తుంది. ఒక కమెడియన్ అయి ఉండి అంత ఆర్థిక సాయం చేయడంపై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సుధీర్ కు కర్ణాటకలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈయన బర్త్డేలకు ఫాన్స్ బెంగళూరులో సంబరాలు చేసుకుంటారు. కన్నడలో చాలామంది సుధీర్ కు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక సుడిగాలి సుధీర్ కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడు చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఒక సినిమాకు సంతకం చేసి షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.