సుడిగాలి సుధీర్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే మతి పోవడం గ్యారెంటీ!

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కమెడియన్ అందరికీ సుపరిచితమే. ఈయన 1987లో విజయవాడలో ఆనంద్ బయనా, నాగమణిలకు జన్మించాడు. ఈయనకు ఒక తమ్ముడు, ఒక సోదరి ఉన్నారు. సుధీర్ తను చదువుకునే రోజుల్లోనే తన మామయ్య దగ్గర మ్యాజిక్ చేయడం నేర్చుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా వాళ్ళ అమ్మకు తెచ్చి ఇచ్చేవారట.

సుడిగాలి సుధీర్ చదువుకునే రోజుల్లోనే భరతనాట్యం, జానపద బాగా నేర్చుకున్నాడు. ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అవకాశాలు వెతకడం ప్రారంభించాడు. రామోజీ ఫిలిం సిటీ ఇంకా కొన్ని టీవీ షోలో గారడి విద్య ద్వారా డబ్బు సంపాదించి ఇంటికి పంపించేవాడు. అవకాశాలు రాకపోవడం మరోవైపు తండ్రికి యాక్సిడెంట్ అయిందన్న వార్తతో తిరిగి విజయవాడకు వెళ్ళిపోయాడు.

తండ్రికి ప్రమాదం తప్పింది. కానీ కుటుంబ భారమంతా సుధీర్ పై పడడంతో చేసేదేమీ లేక మళ్ళీ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. మ్యాజిక్ షోలు చేస్తూ ఉండగా మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోకు అవకాశం వచ్చింది. ఆ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు సుధీర్. ఇక జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

జబర్దస్త్ షోలో చేస్తూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించగా సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈయన జబర్దస్త్ షో మాత్రమే కాకుండా ఢీ, పోవే పోరా షోలు కూడా చేస్తున్నాడు. ఇక జబర్దస్త్ ద్వారా నెలకు మూడు లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మిగతా షో లలో రోజుకు 25 నుంచి 30 వేలకు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇక ఈయన హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాలో నటించాడు ఈ సినిమాకి గాను 15 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన త్రీ మంకీస్ సినిమాలో 17 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక తాజాగా సినిమాలలో 20 లక్షల పైగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది. ఈయన దగ్గర లగ్జరీ కారు ఒక బైక్ ఉన్నాయి. హైదరాబాదులో సొంతంగా ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. మొత్తంగా మూడు కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది.