దర్శకేంద్రుడి మార్క్ కనిపిస్తోంది.. విష్ణుప్రియ అందాల ప్రదర్శన పీక్స్?

బుల్లితెర వ్యాఖ్యాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న విష్ణు ప్రియ గత కొంతకాలం నుంచి ఎలాంటి అవకాశాలు లేకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేది. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విష్ణు ప్రియ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ఆగస్టు 19వ తేదీ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం విడుదల తేదీని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే హీరోయిన్ బొడ్డు పై పండ్లు,పువ్వులు పడాల్సిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఇలాంటి సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయి.

ఈ క్రమంలోనే ఈయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన
వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో కూడా తన మార్క్ చూపించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఏకంగా విష్ణు ప్రియ బొడ్డులో ఆకు ఉండటం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ వాంటెడ్ పండుగాడ్ సినిమా ద్వారా ఆగస్టు 19వ తేదీ మీకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాం తప్పనిసరిగా ఈ డేట్ సేవ్ చేసి పెట్టుకోండి అంటూ ఈమె తెలియజేశారు. మొత్తానికి ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అనసూయ, సుడిగాలి సుదీర్, దీపిక పిల్లి,బ్రహ్మానందం తనికెళ్ల భరణి శ్రీనివాస్ రెడ్డి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వంటి సీనియర్ కమెడియన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.