విజయ్ దేవరకొండ గురించి ఓపెన్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఏమన్నారంటే?

రామ్ గోపాల్ వర్మ తెలుగు చలనచిత్ర దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలను నిర్మించడం జరిగింది. ఇతను హర్రర్, మాఫియా లాంటి చిత్రాలు తెరకు ఎక్కించడంలో ప్రసిద్ధి చెందాడు. తెలుగులోనే కాక హిందీ సినిమాలలో కూడా దర్శకనిర్మాతగా రాణించడం జరిగింది.

మొదటి రెండు సినిమాలలో సహాయ దర్శకుడిగా పనిచేసి.. 1990లో విడుదలైన శివ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే గుర్తింపు పొంది 1991లో రాత్ సినిమాకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. తర్వాత తెలుగు, హిందీలలో అనేక చిత్రాలకు దర్శకుడిగా.. నిర్మాతగా రాణించాడు.

ఇలా తన కెరీర్లో బిజీగా ముందుకు సాగుతున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్ దేవర గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూ ద్వారా ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండపై.. ఇతను నటించిన లైగర్ సినిమాపై జరిగిన రచ్చ.. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ మరే ఇతర దానిమీద జరగలేదని స్పష్టం చేశాడు.

లైగర్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా ప్లాప్ అని రెండు వేలకు పైగా వీడియో రివ్యూ రావడం భారీ చర్చకు దారితీసింది. కొందరు హీరోలు ఉద్దేశపూర్వకంగానే విజయ్ దేవరకొండను తొక్కేయడానికి టార్గెట్ చేశారని అభిప్రాయపడ్డారు. విజయ్ దేవరకొండ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు.

విజయ్ దేవరకొండ లో యాటిట్యూడ్ అనేది తన అర్జున్ రెడ్డి సినిమా నుంచే ఉంది. అందుకే స్టార్ అయ్యాడు. విజయ్ దేవరకొండలో వినయం కనపడకపోవడంతో బాలీవుడ్ ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఎదుగుతుంటే పక్క వారు జీర్ణించుకోలేరు విజయ్ దేవరకొండ విషయంలో అదే జరిగింది.

అవతలి వాళ్లు విజయ్ దేవరకొండలోని యాటిట్యూడ్ ని ఒక ఛాన్స్ లా వాడుకొని తొక్కేసే ప్రయత్నం చేశారని తెలిపాడు. ఇక వర్మ విషయానికి వస్తే 2022 లో ఈయన దర్శకత్వం వహించిన మా ఇష్టం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.