బాలయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి.. అలా ఫీలయ్యాను అంటూ!

ఎస్ ఎస్ రాజమౌళి ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. ఇతను ప్రధానంగా తెలుగు సినిమాలలో పనిచేస్తున్నాడు. భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న దర్శకుడు. ఇతను యాక్షన్, ఫాంటసీ ఇంకా ఎపిక్ జానర్ చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు.

ఇతను దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలు. భారత ప్రభుత్వం కళా రంగంలో ఆయన చేసిన కృషికి పద్మశ్రీ తో సత్కరించింది.

ఇతను 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి దర్శకత్వం వహించి సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రాజమౌళి ఇప్పటివరకు 12 చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇతను మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు.. నాలుగు ఫీలింగ్ ఫేర్ అవార్డ్స్.. ఐదు నంది అవార్డులు అందుకున్నాడు.

ఇలా వరుసగా చేస్తున్న సినిమాలు విజయపథంలో ముందుకు సాగుతూ.. కెరీర్ లో బిజీగా గడుపుతున్న రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం తనకు రెండుసార్లు కావడం జరిగిందని కాస్త ఫీల్ అవ్వడం జరిగింది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ లాంటి గొప్ప వ్యక్తి లేరని చెప్పడం జరిగింది.

మామూలుగా అయితే ఇండస్ట్రీలో సినిమా సక్సెస్ అయితే తమ వల్లే సక్సెస్ అయింది అంటారు. ఒకవేళ సక్సెస్ కాకపోతే దాని బాధ్యతను నిర్మాత పైన.. దర్శకుడు పైన నేడతారు. కానీ బాలకృష్ణ తన సినిమా సక్సెస్ అయిన కాకపోయినా ఒకే రకంగా ఉంటారని.. తన పేరును ఎప్పుడూ చెప్పుకోరని పేర్కొనడం జరిగింది.

ఇక రాబోయే రోజుల్లో బాలకృష్ణ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే కచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్త తెలిసిన బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఆనందం నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది వేరే లెవల్ లో ఉంటుందని బాలకృష్ణ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.