తల్లి, తండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. చదువులో రాణిస్తారా, కెరీర్‌లో సక్సెస్ అవుతారా ఇవన్నీ తెలిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. న్యుమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన తేదీ ద్వారా పిల్లల లక్షణాలు, కెరీర్, విద్యా సామర్థ్యం, వ్యక్తిత్వ లక్షణాలు తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం, ఏ వ్యక్తి 1, 10, 19, 28 తేదీలలో జన్మిస్తారో వారి జన్మ సంఖ్య 1. ఈ సంఖ్య ఉన్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం అత్యంత అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర భావన, ఉన్నత స్థానాలపై రాణించే సామర్థ్యం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ పిల్లలు చదువులో మాత్రమే కాకుండా, జీవితంలో కూడా ముందుండే వ్యక్తులుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇక 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారిలో జన్మ సంఖ్య 3. ఈ సంఖ్య కలిగిన పిల్లల్లో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వారు కళా రంగం, టీవీ, మీడియా, సంగీతం వంటి ఫీల్డుల్లో త్వరగా గుర్తింపు పొందుతారు. సృజనాత్మకమైన పని చేసే వారిలో సంఖ్య 3 ఉన్నవారు ఎక్కువగా ఉంటారు. మరో వైపు, 7, 16, 25 తేదీలలో పుట్టిన పిల్లల్లో జన్మ సంఖ్య 7. ఈ సంఖ్య కలిగిన పిల్లలు పరిశోధనాత్మక స్వభావం, లోతైన అర్ధాన్ని గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు చదువులో ఉన్నత స్థాయికి చేరతారు మరియు భవిష్యత్తులో విశిష్ట స్థానాలు సంపాదిస్తారు. అలాగే, వీరి నాలెడ్జ్ ఎక్కువగా ఉండడం, విశ్లేషణలో నైపుణ్యం ఉంటాయి.
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన పిల్లల్లో జన్మ సంఖ్య 5. ఈ సంఖ్య కలిగిన వారు తెలివితేటలు, చురుకైన స్వభావం, సృజనాత్మక దృష్టిని కలిగి ఉంటారు. జీవితం మార్గాన్ని సరిగా మలిచే సామర్థ్యం, సమస్యలను సులభంగా పరిష్కరించే నైపుణ్యం, మరియు చక్కగా ప్రగతి సాధించే లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. నిపుణులు తెలిపిన మరో ముఖ్యమైన అంశం, జన్మ సంఖ్య కేవలం సూచిక మాత్రమే. పిల్లల వ్యక్తిత్వం, శ్రమ, కృషి మరియు అవకాశాలు కూడా అత్యంత కీలకంగా ఉంటాయి.
సంఖ్యాశాస్త్రం ద్వారా వారు ఏ రకంగా విజయం సాధించగలరో ముందుగా అంచనా వేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇక పాఠకులు ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, పిల్లల భవిష్యత్తులో విశిష్ట లక్షణాలను గుర్తించవచ్చని, వారి ప్రతిభను సరైన దిశలో మార్గనిర్దేశం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కథనం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
