Puneeth Raj Kumar: చనిపోయాక కూడా రికార్డు సృష్టించిన కన్నడ హీరో

Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (అప్పు) జీవించింది 46ఏళ్ళు మాత్రమే.. అయితే ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరంజీవిగా నిలిచిపోయాడు. పునీత్ మరణించి దాదాపు రెండు నెలలు అవుతున్నా.. ఆయన మన మధ్య లేరు అనే వార్తను ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతేకాకుండా పునీత్ మీద ఉన్న తమ అభిమానాన్ని వివిధ రూపాలలో కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అప్పుని కన్నడ ప్రజలు ఎంతగా అభిమానించారు అన్నవిషయానికి మంచి ఉదాహరణ ఏంటంటే.. ఆయన పార్దీవ దేహాన్ని సందర్శనార్ధం ఉంచినప్పుడు చూడటానికి వచ్చినవారు విడిచిన చెప్పులే సాక్ష్యం అని చెప్పవచ్చు.

అప్పుకి కర్ణాటకలోని కాకుండా దేశవ్యాప్తంగా మంచి అభిమానులు. ఈ నేపథ్యంలోనే పునీత్.. 2021 లో అత్యధికంగా వికీపీడియాలో వెతికిన పర్సనాలిటీగా నిలిచాడు. ఆయన చనిపోయాక తరువాత కూడా ప్రణీత్ గురించి తెలుసుకోవడానికి వికీ సెర్చ్ చేశారు. ఈ విషయం తెలిసిన అప్పు అభిమానులు ఒకవైపు గర్వంగా.. మరోవైపు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.