జనార్ధన రావు తెలుగు సినీ నటుడు. బుల్లితెరలో ప్రసారమయ్యే సీరియల్లలో కూడా నటించడం జరిగింది. ఇతనిని అందరూ జెన్నీ అనే పేరుతో పిలుస్తారు. ఇతను దాదాపుగా 400కు పైగా సినిమాలలో నటించడం జరిగింది. ఇక టీవీ సీరియల్ లో దాదాపుగా వెయ్యికి పైగా కార్యక్రమాలలో నటించడం జరిగింది.
విద్యాభ్యాసం తరువాత ఈసీఐఎల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం చేసేవాడు. ఆహ నా పెళ్ళంట సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. యమలీల సినిమాలో తన పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొంది.. వరుసగా తెలుగు సినిమాలలో వరుస అవకాశాలు రావడంతో 2000 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక సినిమాల వైపే దృష్టి పెట్టాడు.
ఇక అసలు విషయం ఏమిటంటే ఇతను గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఓ క్యాంటీన్ ఓనర్ పాత్రలో తాను నటించడం జరిగింది. మేనేజర్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా క్యాంటీన్ ఓనర్ పాత్రను తనకు రేకమండేషన్ చేశాడట.
ఈ విషయం తెలిసి తాను జూనియర్ ఎన్టీఆర్ కు థాంక్స్ చెప్పాను. అప్పుడు ఈ పాత్రకు సెట్ అవుతారని మిమ్మల్ని తీసుకోమన్నాను అని అన్నాడట. ఆ సమయంలో చాలా సంతోషం వేసిందని ఒక పెద్దింటి కి చెందిన అబ్బాయి ఇలా ఇతరులను గుర్తించి అవకాశాలు ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది అని తెలపడం జరిగింది.
బయట అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఎంతోమందిని కలవాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు ఎవరి దగ్గర టాలెంట్ ఉందో గుర్తించి పిలిచి అవకాశం ఇవ్వడం నిజంగా చాలా ఆనందం కలిగించిందని చెప్తూ.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మా రిసెప్షన్ లో ఈసీఎన్ లో రిసెప్షన్ గా పనిచేశారని తెలపడం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ మంచితనాన్ని తన తల్లిదండ్రుల నుంచి అందిపుచ్చుకున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని బయట ఎక్కువగా కనిపించరు. ఎవరినైనా చాలా మర్యాద పూర్వకంగా పలకరించే స్వభావం తన తల్లి నుండి జూనియర్ ఎన్టీఆర్ కు రావడం జరిగిందని పేర్కొనడం జరిగింది.
ఈయన ప్రస్తుతం సినిమా అవకాశాలు.. సీరియల్ అవకాశాలు వస్తున్న వయస్సు కాస్త మీద పడడంతో.. నటించడం దాదాపుగా తగ్గించినట్లుగా తెలుస్తుంది. అడపాదడపా కేవలం సినిమాలలో నటిస్తున్నారని సమాచారం.