నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ప్రముఖ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన నిర్మాత ఇంకా శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిద్యభరితమైన పాత్రలు పోషించడమే కాక పౌరాణిక, జానపద సాంఘిక చిత్రాలలో నటనకు బాగా ప్రసిద్ధి. ఈయన స్వర్గీయ ఎన్. టి. రామారావు కుమారుడు అని అందరికీ తెలిసిందే.
1974లో తాతమ్మకల చిత్రం ద్వారా బాలనటుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. హీరో కాకముందు తండ్రితో కలిసి బాలనటుడుగా.. సహాయ పాత్రలలో చాలానే సినిమాలు నటించడం జరిగింది. ఇక వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటించిన తొలి వందరోజుల చిత్రం ”మంగమ్మగారి మనవడు”. 1984లో విడుదలైన ఈ చిత్రాన్ని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, భానుమతి రామకృష్ణ, సుహాసిని చారుహసన్ నటించగా కె.వి.మహదేవన్ చక్కటి సంగీతం సమకూర్చారు.
ఈ సినిమా 1983లో తమిళంలో విడుదలైన మాన్ వాసనై చిత్రానికి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది. నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి వందరోజుల సినిమా ఇది. ఈ చిత్రం తన కెరీర్ కు మెయిన్ టర్నింగ్ పాయింట్. ఈ చిత్రం కర్ణాటకలో 100 రోజులు.. హైదరాబాదులో 565 రోజులు పూర్తి చేసుకుంది.
ఇది 2006లో పోకిరి సినిమా విడుదలయ్యే వరకు ఆ సమయంలో అత్యధిక రన్నింగ్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక 2022లో విడుదలైన అఖండ విజయం భారీ విజయం సాధించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను కొల్లగొట్టింది. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.