వడ్డే నవీన్ సినిమాలకు దూరం అవడానికి అసలు కారణం అదేనా!

వడ్డే నవీన్ తెలుగు సినీ నటుడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. వడ్డే నవీన్ విద్యాభ్యాసం అంత చెన్నైలోనే జరిగింది. సినిమాలలో నటించాలని ఆసక్తి చిన్నప్పటినుండే ఉండడం వల్ల ఇప్పుడే కొన్ని నాటకాలలో నటించారు. వడ్డే నవీన్ కు కాస్త మొహమాటం ఎక్కువ, ఎక్కువగా మాట్లాడరు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు.

ఇక వడ్డేనవీన్ కు సినిమాలలో నటించాలి అనే ఆసక్తి ఉండడం చేత చెన్నైలోనే నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. దాసరి నారాయణరావు దగ్గర కో డైరెక్టర్ గా పని చేసిన వి ఎస్ రెడ్డి దర్శకత్వంలో 1995లో ఒక సినిమాను నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు కంప్లీట్ అయినట్టే కానీ ఆ సినిమా అవుట్ పుట్ చూసిన రమేష్ తన కొడుకును మొదటి సారి తెరపై చూపించాల్సింది ఇలా కాదని ఆ సినిమాను ఆపేశారు.

ఇక మొదటి సినిమా ఆగిపోవడంతో అదే సంవత్సరంలో కొడుకుతో సినిమా చేయించాలని కాస్త పట్టుదలతో హైదరాబాదులోని ముప్పలేని శివ ను కలిసి విషయం చెప్పి తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని మంచి కథ కావాలన్నారు. ఆ తర్వాత 1997లో వడ్డే నవీన్ హీరోగా కోరుకున్న ప్రియుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం. ఆ సినిమా విజయం సాధించి, గుర్తింపు తెచ్చింది.

ఆ తర్వాత 1997లోనే కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన పెళ్లి సినిమా వచ్చి వడ్డే నవీన్ లైఫ్ ను మార్చివేసింది. రెండవ సినిమాతోనే మంచి పేరు గుర్తింపు పొందాడు. అవకాశాలు బాగా పెరిగి దాదాపు 30 సినిమాలలో హీరోగా నటించడం జరిగింది. అయితే 2001 నుంచి వచ్చిన సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయి.

దీనికి పలు కారణాలు ఏమనగా మొహమాటం కొద్దీ సినిమా కాదనలేక ఓకే చెప్పడం. ఈయన నటించిన సినిమాలు దాదాపు అటు ఇటుగా ఒకేలాగా అనిపించడం. కాస్త డిఫరెంట్ గా ఉండకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ తగ్గింది. తర్వాత కథలు వచ్చిన తనకు సెట్ కావని వదిలేసుకున్నాడు. ఇక పోతే ఎన్టీఆర్ కుమారుడైన రామకృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు కొంతకాలం తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కూతురిని పెళ్లి చేసుకొని సెటిలైపోయినట్టు తెలుస్తుంది.