కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. గత 60 సంవత్సరాల లో 750 కి పైగా చిత్రాలలో నటించాడు. ఇతడు పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక పాత్రలలో నటించాడు. హాస్య, ప్రతినాయక, నాయక లలో ఎన్నో పాత్రలు పోషించాడు. తన నటనతో నవరస నటన సార్వభౌమ అనే బిరుదులు కూడా పొందాడు.
సినీ రంగంలో ఎస్వీ రంగారావు తర్వాత ఆయన పాత్రలలో నటించగల సమర్థులలో ఈయన ఒకరు. ఈయన 1935లో గుడివాడ సమీపంలోని కౌతవరం అనే గ్రామంలో జన్మించాడు. 1960లో నాగేశ్వరమ్మ వివాహం చేసుకున్నాడు. ఈయనకు ఇద్దరు, కొడుకులు ఇద్దరు కూతుర్లు సంతానం. సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు సత్యనారాయణ.
డి ఎల్ నారాయణ 1959లో సిపాయి కూతురు అనే సినిమాలో ఒక అవకాశం కల్పించాడు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా తన కంచు కంఠంతో, గంభీరమైన కాయంతో తనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈయన రుపు రేఖలు కాస్త ఎన్టీఆర్ ను పోలి ఉండడం ద్వారా ఎన్టీఆర్ కు డూపు దొరికినట్టుగా భావించి 1960లో ఎన్టీఆర్ గారు తను నటించే సహస్ర శిరచ్చేద్ర అపూర్వ చింతామణిలో అవకాశం ఇచ్చారు.
ఇందులో యువరాజు పాత్రను పోషించాడు సత్యనారాయణ. తరువాత ఇతనిని ప్రతి నాయకుడి పాత్ర అయితే బాగుంటుందని బి విఠలాచార్య గుర్తించి కనకదుర్గ పూజ మహిమలో వేషం వేయించాడు చక్కగా ఇవ్వడంతో ఇక సత్యనారాయణ వరుస అవకాశాలు విజయాలతో సినీ రంగంలో దూసుకుపోయాడు. 1996లో రాజకీయాలలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గ నుండి 11వ లోకసభ కు ఎన్నికయ్యాడు.
నటశేఖర -అనే బిరుదు అనంతపురంలోని ఒక ప్రభుత్వ సంస్థ ఇచ్చింది. నటశేఖర- అనే గుడివాడ నుండి పురపాలక సంఘం నుండి తీసుకున్నాడు. కళా ప్రపూర్ణ -కావలి సంస్కృతిక సంఘం వారు ఇచ్చినారు. నవరస నటన సార్వభౌమ -ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు పూరి జనులు ప్రయాణం చేశారు. సత్యనారాయణ రామా ఫిలిం ప్రొడక్షన్ ను స్థాపించి ఇద్దరు దొంగలు కొదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.