ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి ఈ సినిమాని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్,బసవరాజు లహరిధర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ నెల 27న ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది.
అయితే సక్సెస్ టూర్ లో భాగంగా మూవీ టీం ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు శివ థియేటర్ కి వెళ్లారు. చూసిన అనంతరం థియేటర్ బయట మూవీ టీం తో కలిసి డైరెక్టర్ కిరణ్ శెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజుని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆగ్రహానికి గురైన మంతెన ఫ్యాన్స్ డైరెక్టర్ పై దాడికి తెగబడ్డారు. డైరెక్టర్ మాట్లాడుతూ ఉండగానే వెనుక నుంచి కొందరు ఆవేశంగా వచ్చి మా మంతెన సత్యనారాయణ రాజునే కించపరుస్తూ సీన్లు తీస్తావా అంటూ డైరెక్టర్ పై చేయి చేసుకున్నారు.
మీడియా సమావేశంలో ఉండగానే కిరణ్ తిరుమల శెట్టి పై విచక్షణారహితంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన మూవీ టీం డైరెక్టర్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నేచురోపతి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యుడిగా అందరికీ తెలిసిన వాడే.
అతని వైద్య విధానాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. అయితే డ్రింకర్ సాయి సినిమాలో మంతెన సత్యనారాయణ స్టైల్ లో ఒక స్పూఫ్ క్యారెక్టర్ ఉంది ఆ పాత్రని భద్రం పోషించారు. అయితే ఇది మంతెనను కించనపరిచేలా ఉందని ఆయన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది ఇది నిజమైన దాడి కాదని మూవీ ప్రమోషన్స్ కోసమే ఇలాంటి ఒక సీన్ క్రియేట్ చేశారని డౌట్ క్రియేట్ చేస్తున్నారు. ఏది నిజమో వాళ్ళకే తెలియాలి మరి.
#DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ
— Suresh PRO (@SureshPRO_) December 29, 2024