ఆంధ్రుల అభిమాన నటుడు, కామెడీ సినిమాల హీరో అయిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాటి తరం వారికే కాదు నేటి తరం వారికి కూడా సుపరిచితుడు రాజేంద్రప్రసాద్. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమాలు ఎంత హిట్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన కామెడీ పవర్ ఏ మాత్రం తగ్గలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే.
అప్పట్లో బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్, ఆలీ రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ కోసమే సినిమాలకు వెళ్లేవారు చాలామంది ప్రేక్షకులు.అయితే ఇటీవల కాలంలో రాజేంద్రప్రసాద్ ఒక యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలని చర్చించారు అందులో ఒకటి నేటి తరం కామెడీ.
ఒకప్పుడు కామెడీ సినిమాలను కామెడీ షో లను కుటుంబం మొత్తం కూర్చొని చూసేవారు కానీ నేడు కామెడీ అంటే బాడీ షేమింగ్, అడల్ట్ జోక్స్ వీటినే కామెడీ అంటున్నారు. ఈ కంటెంట్ తోనే జబర్దస్త్ టీవీ షో ఎంత సూపర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ విషయంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మీరు ఏమన్నా అనుకోండి కానీ ఈ రోజుల్లో కామెడీ స్టాండర్డ్ తగ్గింది. ఒకప్పుడు జంధ్యాల, రేలంగి ఇవివి సత్యనారాయణ వంటి దర్శకులు కామెడీ బాగా రాసేవారు అప్పట్లో రాసే కామెడీ పిల్లలు కూడా చూసేవాళ్ళు.
గతంలో నేను చేసిన కొన్ని సినిమాలలో రెండు మూడు సార్లు భూతులతో ఉన్న కామిడీ డైలాగ్స్ వస్తే నేను చెప్పను అని చెప్పి రిజెక్ట్ చేసి మార్పించుకున్నాను. నేను అలాంటి కామెడీ చేయను అని ఖరాకండిగా చెప్పాను. రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే షోలో రాజేంద్రప్రసాద్ తన కూతురు చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అంతే కాదు తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఈ షో ద్వారా తెలియజేశారు.