రాధిక ఆప్టే ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో లెజెండ్, రక్త చరిత్ర ధోని వంటి సినిమాలలో నటించారు. అయితే ప్రస్తుతం తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక రాధిక ఆప్టే ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమేనని చెబుతోంది. ఈ క్రమంలోనే బోల్డ్ పాత్రలలో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయని రాధిక ఆప్టే సోషల్ మీడియాలో కూడా తన బోల్డ్ ఫోటోలతో రచ్చ చేస్తుంటారు.
ఇకపోతే రాధిక ఆప్టే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఎప్పుడు తన వృత్తిపరమైన జీవితం గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ ప్రస్తావించరు. నిజం చెప్పాలంటే ఈమెకు పెళ్లి అయిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈమె పది సంవత్సరాల క్రితమే విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.అయితే ఎప్పుడు కూడా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను కానీ లేదా తన భర్తకు సంబంధించిన విషయాలను కానీ ఈమె ప్రస్తావించరు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదని తెలిపారు.
ఇకపోతే తన పెళ్లి అయినప్పటికీ తన వృత్తి నిమిత్తం ముంబైలో ఉంటున్నానని తన భర్త మాత్రం విదేశాలలో ఉంటున్నారని తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయకపోవడానికి ఒక కారణం ఉందని తెలిపారు. నేనే నా వ్యక్తిగత విషయాల గురించి బయట పెట్టను ఇక ఈ విషయంలో నా భర్త నాకన్నా చాలా వేస్ట్.. ఆయన కనీసం ఇద్దరం కలిసి ఫోటోలు దిగదామన్నా కూడా ఆసక్తి చూపించరని ఫోటోలు దిగే విషయంలో నా భర్త ఏమాత్రం కోపరేట్ చేయరు అంటూ రాధిక ఆప్టే తన భర్త గురించి తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.