ఆకాష్ దక్షిణ భారత చలనచిత్ర నటుడు, దర్శకుడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో నటించాడు. ఈయన శ్రీలంకలో జన్మించాడు. ఇతని అసలు పేరు సతీష్ నాగేశ్వరన్. ఆకాష్, నిషా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తమిళంలో రోజావనం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తెలుగులో రామ్మా! చిలకమ్మా అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
శీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇక ఇండస్ట్రీలో పాపులర్ నటుడుగా వరుసగా అవకాశాలు వచ్చాయి. వసంతం, గోరింటాకు, నవవసంతం సినిమాల ద్వారా మంచి పేరు, ప్రతిష్టలు ఇంకా అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.
మంచి అవకాశాలతో ముందుకు దూసుకుపోతున్న ఆకాష్ కెరీర్ సడన్ గా బ్రేక్ పడడం, అవకాశాలు తగ్గడం జరిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నకు తనను కావాలనే కొంతమంది తొక్కేయాలని చూశారని, అప్పట్లో ఆ క్రేజ్ చూసి ఓర్వలేక తనను నమ్మించి మోసం చేశారని పేర్కొన్నాడు.
ఆకాష్ చేసిన సినిమాలలో ఒక సినిమా విడుదలైనప్పుడు వాల్ పోస్టర్ పై సినిమా విడుదల అని కాకుండా ఆడియో విడుదల అని రాశారని, సినిమాను పెద్దపెద్ద థియేటర్లలో కాకుండా, చిన్న చిన్న థియేటర్లలో ఎక్కడో మారుమూలలో ఉన్న ప్రాంతాలలో విడుదల చేయడం ద్వారానే తన సినిమాలు సరిగ్గా ఆడలేదని పేర్కొన్నాడు.
కొంతమంది తన మంచి సినిమాలకు తక్కువ పబ్లిసిటీ ఇచ్చి, కాస్త బాగాలేని సినిమాలకు ఎక్కువ పబ్లిసిటీ చేసి, అవకాశాలు రాకుండా చేశారు అని చెప్పుకున్నాడు. రెమ్యూనరేషన్ విషయంలో తనకు పెద్ద పట్టింపు ఉండేది కాదని ఆ విషయంలో చాలా కాంప్రమైజ్ అయ్యే వాడిని కూడా చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే మాఫియా కంటే డేంజర్ గా సినీ ఇండస్ట్రీ ఉందని, చాలా దారుణంగా నమ్మించి, తొక్కేశారని పేర్కొన్నాడు.