AP: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పదేపదే జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కూబిలో పడేస్తున్నారని మన రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా తయారు చేస్తున్నారు అంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆరు లక్షల కోట్ల అప్పు ఉండగా ఈయన మాత్రం 14 లక్షల కోట్లు అప్పు చేశారంటూ తప్పుడు ప్రచారాలు చేశారు.
ఇక ఇదే విషయం గురించి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో స్వయాన ఆర్థిక శాఖ మంత్రి అసలు విషయాలను బయటపెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ సంచలనాలను సృష్టిస్తున్నారు. ఇలా అప్పులు చేయడంలో కూడా బాబు రికార్డులు సృష్టించారంటూ ఇటీవల మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.1,12,750 కోట్ల అప్పులు చేసిందట. ఇది అప్పుల్లోనే ఒక సరికొత్త రికార్డ్ అంటున్నారు మాజీ మంత్రి బుగ్గన. ఒకప్పుడు జగన్ అప్పు చేస్తే శ్రీలంక అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కూబీలో నెట్టేస్తున్నారని మరి ఇప్పుడు శ్రీలంక అవ్వదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇలా ప్రతినెల వేలకోట్ల రూపాయల అప్పులను చేస్తూ పెద్ద ఎత్తున ఆర్థిక లోటును సృష్టిస్తున్నారు. అయితే ఇలా ఈయన అప్పు చేసిన ఆ డబ్బుతో ఏం చేస్తున్నారంటూ కూడా సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు జగన్ అప్పు చేసిన ఆ డబ్బును సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు. మరి బాబు అప్పు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందించకుండా ఆ డబ్బును ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు