కమెడియన్ సత్య గుర్తున్నాడా.. ఆయన ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?

సత్య కమీడియన్ గా అందరికీ సుపరిచితమే. తను ఎలా ఉన్నా తన యాక్టింగ్ తో మాత్రం ప్రేక్షకులను నవ్వించడం పక్క. సత్య 1988లో ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురంలో జన్మించాడు. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. సత్య బిటెక్ మధ్యలోనే ఆగిపోయింది. చిన్నప్పటినుండి స్కూల్లో నాటకాలలో నటించడం ద్వారా సినిమాలలో నటించాలి అన్న కోరిక ఉండేది.

సినిమా అవకాశాల కోసం ఖర్చులకు ఒక పది వేలు తీసుకుని హైదరాబాద్ వచ్చేసాడు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్న డబ్బు కాస్త అయిపోగొట్టుకున్నాడు. తరువాత చిన్నచిన్న పనులు చేస్తూ అవకాశాల కోసం తిరుగుతూ జూనియర్ ఆర్టిస్టులతో కాస్త పరిచయం ఏర్పడింది. ఒక్కోసారి అన్నం లేక నీళ్లు తాగి ఉండేవాడు. ఇలా చాలా కష్టాలు ఎదుర్కొంటూ అవకాశాల కోసం వేచి చూడగా చాలా రోజుల తర్వాత 2009లో ద్రోణ సినిమాలో చిన్న అవకాశం వచ్చింది.

ఆ పాత్ర వల్ల పేరు ఏమీ రాకపోయినా పిల్ల జమిందార్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించి అందరినీ మెప్పించాడు సత్య. ఇక వెనుకకు తిరగాల్సిన అవసరం లేకుండా వరుసగా స్వామి రారా, రామయ్య వస్తావయ్య, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు బాగా సెట్ అయ్యి కామెడీ తో ప్రేక్షకులను నవ్వించాడు. మెయిన్ క్యారెక్టర్ గా వివాహ భోజనంబు సినిమాలో నటిస్తే ఓటీటి లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అప్పట్లో రోజుకు 1200 వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. తరువాత అవకాశాలు రావడంతో ఒక్కో సినిమాకు 10 నుంచి 15 లక్షలు తీసుకునేవాడు. ప్రస్తుతం 20 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతని వద్ద రెండు కార్లు ,ఒక బైక్ ఉన్నాయి. హైదరాబాదులో ఉంటున్న ఇంటి విలువ దాదాపు ఒక కోటి 50 లక్షలు ఉండవచ్చు. మొత్తంగా సినిమాల ద్వారా 7 నుండి 7.5 కోట్లు సంపాదించినట్లు తెలుస్తుంది.