నటుడు విజయ్ చందర్ గుర్తున్నాడా.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

విజయ్ చందర్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. తెలుగు సినిమా యొక్క అత్యుత్తమ క్యారెక్టర్ యాక్టర్ లలో ఒకరిగా పరిగణించబడుతున్న విజయ్ చందర్ 40 కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించాడు.

1967లో సుడిగుండలు చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేశాడు. 1978లో ఇతను నిర్మించిన కరుణామయుడు చిత్రంలో జీసస్ ఆఫ్ నజెరత్ ను రాశాడు. ఈ చిత్రం ద్వారా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకున్నాడు. 1982లో ఆంధ్రకేసరి సినిమాలో టంగుటూరి ప్రకాశం పంతులుగా నటించాడు.

ఈ చిత్రం ద్వారా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఇతను 1986లో క్లాసిక్ శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం లో షిరిడి సాయిబాబా కథ రాశాడు. ఇది భారతదేశంలోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.

అదే సంవత్సరం సూపర్ హిట్ అయిన వేమన చరిత్రలో వేమన సాధువుగా కనిపించాడు. 2003లో కబీర్ దాస్ చిత్రంలో కబీర్ పాత్రను పోషించాడు. ఇలా తనదైన శైలిలో నటనతో మంచి గుర్తింపు పొందిన విజయ్ చందర్ దైవ పాత్రలకు పెట్టింది పేరుగా బాగా ప్రసిద్ధి చెందాడు.

ఇలా వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న విజయ్ చందర్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో ఆయనకు తాను ఎక్కువగా దైవ పాత్రలో కనిపించడం ఎలా అనిపిస్తుంది అనే ప్రశ్న ఎదురయింది.

అందుకు సమాధానంగా అంతా ఆ దేవుడే నాతో ఈ పాత్రలు వేయించినట్టుంది. తనకు ఇలాంటి పాత్రలలో నటించడం అంటే ఎంతో ప్రీతీ అని చెప్పడం జరిగింది. ఈ పాత్రల ద్వారా గుర్తింపు రావడం చాలా అదృష్టంగా తాను ఫీలవుతున్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది.

ఇక ఆ ఇంటర్వ్యూ ద్వారా రాజకీయాలలో యువకులు ఎక్కువగా రావాలని.. ప్రస్తుత సమాజానికి యువకుల ఆలోచనలే అభివృద్ధికి దోహదపడతాయని, రాజకీయరంగంలో కూడా ఎక్కువ యువకులు ఉండాలని తన కోరిక అన్నట్లు చెప్పడం జరిగింది.