ఫిష్ వెంకట్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఫిష్ వెంకట్ తెలుగు చలనచిత్ర నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన పూర్తి పేరు మంగిలంపల్లి వెంకటేష్. హైదరాబాదులోనే పుట్టి పెరిగాడు.మూడవ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత ముషీరాబాద్ లోని కూరగాయల మార్కెట్లో చేపల వ్యాపారం చేసేవాడు.

అందువల్లనే ఈయనకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది. ఈయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు సంతానం. కూతురికి వివాహం చేశాడు. ఈయన పెద్ద కుమారుడు యాదష్ వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డి ఫర్ దోపిడి సినిమాలలో ప్రతినాయక పాత్రలలో నటించడం జరిగింది. మిగిలిన ఇద్దరు కుమారులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

వెంకట్ సినీ పరిశ్రమకు తన ఫ్రెండ్ అయినా శ్రీహరి ద్వారా వచ్చాడు. శ్రీహరి, వి.వి. వినాయక్ పరిచయం చేశాడు. వి.వి. వినాయక్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడంతో ఈయనను గురువుగా భావిస్తాడు. ఈయన ఎక్కువగా తెలంగాణ భాష మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు నటిస్తాడు. తన నటనతో ప్రజాధరణ పొంది దాదాపు 90 వరకు సినిమాలలో నటించడం జరిగింది.

పలు సినిమాల్లో నటించి తన అమాయకపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఫిష్ వెంకట్ ఓ మీడియా ఇంటర్వ్యూలో కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని, అవకాశాలు తక్కువ నటించే వాళ్లు ఎక్కువగా ఉండటంతో తెలిసిన వారికి మాత్రమే అవకాశాలు వస్తాయి.

కొత్తవారికి అవకాశాలు రాక, డబ్బులు సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక మీడియా ద్వారా కొత్తవారిని రావద్దు అని చెప్పాడు. సినిమా అంటే రంగుల ప్రపంచం తెలిసినవారు, ఇంకా మంచి అవకాశాలు వస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాం లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశంతో బతకడం కూడా కష్టం అవుతుంది. సినిమాలలో నటించాలని వచ్చి ఇబ్బందులు పడే వారిని చాలామందిని చూసి కన్నీళ్లు తెచ్చుకున్నట్టు మీడియాతో పంచుకున్నాడు. ఈయన ఒక సినిమాకు 50 వేల వరకు రెమ్యూనికేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.