అక్కినేని అమల సినిమాలకు దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా?

అక్కినేని అమల తెలుగు సినీనటి, జంతు సంక్షేమ కార్యకర్త. ఈమె పూర్తి పేరు అమల ముఖర్జీ. తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు, తండ్రి బెంగాలీ. 1968లో పశ్చిమబెంగాల్ లో జన్మించింది. ఈమె తండ్రి ఇండియన్ నేవీ అధికారి. అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఏనై కథిలి అనే తమిళ చిత్రంలో నటించినది. ఇది చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది.

ఈమె 1991లో మలయాళ చిత్రం ఉడలక్కమ్ లో తన పాత్రకు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. తెలుగులో డి.రామనాయుడు నిర్మించిన చినబాబు చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించి తెలుగు తెరకు పరిచయమయ్యింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి 1992లో వివాహం జరిగింది. 1994లో అఖిల్ కు జన్మనిచ్చారు. తర్వాత నటనకు స్వస్తి చెప్పింది. 2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా మళ్ళీ తెరపై కనిపించింది.

అమల హైదరాబాదులోని బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, భారతదేశంలోని జంతువుల సంక్షేమం మరియు జంతు హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వతర సంస్థ (NGO) సహా వ్యవస్థాపకురాలు. అమలకు జంతువులు, పర్యావరణం అంటే ఎంతో ఇష్టం. ఇటువంటి కార్యక్రమాలలో పాలుపంచుకొని వాటికి సేవలందించడం కోసం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది.

2012లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి జీవ్ దయా పురస్కార్ అందుకుంది. 2017 లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి నారీ శక్తి పురస్కారం అందుకుంది. కాకుండా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు గాను ఉత్తమ సహాయక ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. సినిమాలకు దూరంగా ఉండి, కుటుంబ బాధితులు చూసుకుంటూ, జంతువుల పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తూ లైఫ్ ను బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.