Samantha: సినీనటి సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా అక్కినేని కుటుంబంతో కలిసి ఒకే వేదికపై కలిసి కనిపించలేదు కానీ తాజాగా తన మాజీ అత్త అమలతో కలిసి ఈమె ఒకే కార్యక్రమంలో సందడి చేశారు. సమంత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా 2010వ సంవత్సరంలో విడుదల అయ్యింది.
ఇలా సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జీ తెలుగు ఈమెను జీ తెలుగు అప్సర అవార్డుతో సత్కరించింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా సమంత అమల ఒకే చోట కనిపించడంతో ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమానికి అమలా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రోజా, డైరెక్టర్ సుకుమార్, రమ్యకృష్ణ, జయసుధ, అనిల్ రావిపూడి తదితరులు విచ్చేశారు.ప్రోమోలో అనిల్ రావిపూడి చేతుల మీదగా సమంత స్టేజ్ పై అప్సర అవార్డును అందుకుంది. ఇదే ప్రోమోలో సమంత తెలుగు ఇండస్ట్రీ నాకు అన్ని ఇచ్చింది. నా తొలి ప్రాధాన్యత తెలుగు ప్రేక్షకులే.. తెలుగు ఇండస్ట్రీనే అని, మీ అందరి ముందు నేను ప్రామిస్ చేస్తున్న అంటూ సమంత మాట్లాడిన మాటలకు అక్కడే ఉన్న అమల చప్పట్లు కొట్టారు దీంతో ఈ సన్నివేశం కాస్త ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత అమల ఇలా ఓకే కార్యక్రమంలో పాల్గొనడంతో అభిమానులు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.