గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషీ ఎంత సంపాదించాడో తెలుసా?

రిషీ గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పరీక్షకులకు సుపరిచితమైన రిషీ అసలు పేరు ముఖేష్ గౌడ. ఈయన 1994లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించాడు. ఇతని తండ్రి ఇన్స్పెక్టర్ గా పనిచేసేవాడు. ఈయనది మధ్యతరగతి కుటుంబం. ఈయనకు ఒక అక్క ఉంది. ముఖేష్ గౌడ చిన్ననాటి నుండే సినిమాలలో నటించాలి అనే కోరిక ఉండేది. తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రికి పక్షవాతం వచ్చింది.

దానితో కెరీర్ పై దృష్టి పెట్టాలని చదువులు పూర్తి చేశాడు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం బాగానే ఉంది. డిగ్రీ చదివే రోజులలో నటనపై ఆసక్తితో ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకున్నాడు. తరువాత కన్నడలో ఒక సీరియల్ లో అవకాశం వచ్చింది. తర్వాత కన్నడ సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ వస్తే నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత ఏది అవకాశం వస్తే అది చేయాలని భావించుకున్నాడు. అనుకోకుండా హైదరాబాద్ మాటీవీ నుండి ఫోన్ వచ్చింది.

ఒక సీరియల్ లో ముఖ్యమైన పాత్ర ఉంది మీరు ఒకసారి వచ్చి కలిస్తే బాగుంటుంది అంటే హైదరాబాద్ వచ్చాడు. గుప్పెడంత మనసు సీరియల్ గురించి చెప్తూ అందులో తన పాత్ర గురించి చెప్తే మొత్తం నచ్చి ఓకే చెప్పేశాడు. తెలిసినవాళ్లు వద్దు ఆ సీరియల్ పెద్దగా ఉండదేమో అంటే వారి మాటలు వినకుండా నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అయితే తన స్టైల్,తన కళ్ళు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి.

ముఖ్యంగా ఈ పాత్ర కాస్త గర్వంతో కనికరం లేకుండా, ఏదైనా ముఖం మీదనే చెప్పేసే పాత్ర. ఇలా ఈ సీరియల్ ద్వారా తనను తాను నిరూపించుకున్నాడు ముఖేష్ గౌడ. అయితే ఇతను అప్పట్లో రోజుకు 1000 నుంచి 2500 వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో రోజుకు 8 నుంచి పదివేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈయన ఫ్యామిలీ అంతా మైసూర్లో ఉంటారు. ఈయన హైదరాబాదులోని ఒక అపార్ట్మెంట్లో రెంట్ కు ఉంటాడు. ఈయన దగ్గర రెండు కార్లు, ఒక బైక్ ఉంది. దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లు సంపాదించినట్లు తెలుస్తుంది.