భారత షూటింగ్ జట్టు కోచ్ శ్రేయన్ కపూర్ ప్రముఖ తెలుగు హీరోయిన్ కుమారుడని మీకు తెలుసా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రాణించినవారు.. తర్వాత తమ పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలో పైకి ఎదగాలని కోరుకుంటారు. అలా పైకి ఎదిగితే వారి కంటే సంతోషించేవారు ఇంకెవరు ఉండరు. కానీ ఒక హీరోయిన్ కొడుకు మాత్రం మరో రంగం వైపు అడుగు పెట్టాడు. ఇక అతడు ఎవరో కాదు…శ్రేయాన్ కపూర్. మరి ఇతను ఎవరంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి, వరుస విజయాలతో మంచి గుర్తింపు పొందిన జయసుధ. అప్పట్లో హీరోయిన్గా చేసిన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రముఖ సహాయ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇక తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నటి జయసుధ. ఇక ఈమె రెండవ కుమారుడే భారత షూటింగ్ జట్టు కోచ్ శ్రేయాన్ కపూర్. చిన్నప్పటినుండి గన్ షూటింగ్ అంటే శ్రేయాన్ కు ఎంతో ఇష్టం. చాలా ఆసక్తితో నేర్చుకోవడం జరిగింది. కాని జయసుధ మొదట ఇతనిని సినిమా రంగం వైపు ప్రోత్సహించింది. ఒక సినిమాలో నటించిన తర్వాత శ్రేయాన్ ను అర్థమైంది.

సినీ రంగంలో కంటే గన్ షూటింగ్ లోనే రాణించగలుగుతాను అనుకున్నాడు. ఇక గన్ షూటింగ్ పై దృష్టి పెట్టి ఏకంగా మూడు నేషనల్ ఛాంపియన్షిప్ సాధించాడు. ఇండియా లెవెల్ లో 30 పథకాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇండియన్ షూటింగ్ జట్టు కు కోచ్ గా మారి మొదటిసారే ఒక స్వర్ణ పతాకం, ఒక కాంస్య పతాకం గెలిచేలా శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదులో గన్ షూట్ లో కొందరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు.

తెలంగాణ రిఫైల్ షూటింగ్ సంఘం వారు కూడా సహకారం అందించడం జరిగింది. జయసుధ భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో శ్రేయాన్ కపూర్ గురించి వస్తున్న వార్తలు చూసి చాలా సంతోషంగా ఉందట. చిన్న వయసులోనే తన కొడుకు ఇంటర్నేషనల్ లెవెల్ లో కోచ్ గా మారడం చాలా గర్వంగా ఉందని తెలిపిందట. ఈ సమయంలో తన భర్త ఉండి ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేదని తెలిపింది.

తన కొడుకు సినీ రంగంలో ఎదగాలని కోరుకుంది. కానీ ఏదైనా మన మంచికే అన్నట్లు ప్రస్తుతం తన కుమారుడి ఎదుగుదలను చూసి గర్వంగా ఉందని కూడా తెలిపింది. ప్రస్తుతం జయసుధ తన కుమారులను చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తుంది.