మురళీ శర్మ తెలుగు సినీ నటుడుగా అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ భాషలలో నటించాడు. తెలుగు, హిందీ చిత్రాల ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు. మురళి శర్మ దాదాపుగా 120 కి పైగా చిత్రాల్లో నటించడం జరిగింది.
మురళీ శర్మ 2004లో షారుక్ ఖాన్ నటించిన మై హూ నా చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక 2007లో మహేష్ బాబు నటించిన అతిథి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి గాను నంది అవార్డును సొంతం చేసుకున్నాడు.
అలాగే 2007 సంవత్సరంలోనే కంత్రి సినిమాలో నటించిన జరిగింది. ఇక వరుస అవకాశాలతో తెలుగు ఇంకా హిందీ ఇండస్ట్రీలలో రాణించడం జరిగింది. తర్వాత మలయాళం, తమిళం, మరాఠీలలో అవకాశాలు వస్తే అక్కడ కూడా తన నటన నిరూపించుకొని గుర్తింపు తెచ్చుకున్నాడు.
మురళి శర్మ ఎక్కువగా విలన్ పాత్రను పోషించాడు. మొదట్లో సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసేవాడు. ప్రస్తుతం ఈయన కోసం సినిమా అవకాశాలు ఎదురు చూసేంత స్థాయికి ఎతిగాడు. ఇక అసలు విషయం ఏమిటంటే మురళీ శర్మ భార్య అశ్విని కులశేఖర్ కూడా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుతో రాణిస్తుంది.
అశ్విని కులశేఖర్ బాలీవుడ్ లో ప్రముఖ నటి. ఈమె ఎక్కువగా హిందీ చిత్రాలలో, హిందీ సీరియల్లలో నటిస్తూ హిందీ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో తాను కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ సినిమాలో కూడా ఈమె ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది.
ఇక మురళి శర్మ విషయానికి వస్తే అలా వైకుంఠపురంలో తన నటనకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది. ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. సినిమాలో ఏ పాత్రలో అయినా జీవించగలిగే ప్రతిభ మురళీ శర్మ లో ఉంది.