చంద్రబాబు నమ్మినోళ్లకు అదే పరిస్థితి రిపీట్ కానుందా.. ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందా?

రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేసినా చెల్లుతుంది. ఎన్నికల ముందు బాగానే ఉన్నా ఎన్నికల్లో గెలిచిన తర్వాత డబ్బు మాయలో పడి ప్రజలకు అన్యాయం చేసి రాజకీయాలకు దూరమైన రాజకీయల నాయకుల సంఖ్య తక్కువేం కాదు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పై సంచలన ఆరోపణలు చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబును కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నమ్ముతుండగా వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు టీడీపీని నమ్ముకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు సైతం ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాయలో పడితే మాత్రం ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ సర్కార్ సైతం ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేలా మరిన్ని కీలక నిర్ణయాలతో ప్రజల ముందుకు రానుందని సమాచారం అందుతోంది. వైసీపీ పార్టీ తరపున విజయం సాధించి ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేసేవాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ పై విమర్శలు చేసిన ఏ ఒక్క వైసీపీ నేత మళ్లీ విజయం సాధించే ఛాన్స్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నలుగురు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీకి మాత్రం ఊహించని స్థాయిలో నష్టం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల సమయానికి ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.