మహేష్ బాబు ఇంట్లో మరో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు!

సూపర్ స్టార్ కృష్ణ నటుడిగా అందరికి సుపరిచితమే. కృష్ణ హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరా దేవితో వివాహం జరిగింది. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో చేయడం జరిగింది.

ఈయన స్వయంగా కొన్ని సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే ఈయన చనిపోవడం జరిగింది. ఇక మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. కుమార్తె పద్మావతి గల్లా జయదేవుని వివాహం చేసుకున్నారు. మంజుల నిర్మాత, నటుడైన సంజయ్ స్వరూప్ ను వివాహం చేసుకున్నారు.

ఇక ప్రియదర్శిని నటుడు, నిర్మాత గా కొనసాగుతున్న సుదీర్ బాబును వివాహం చేసుకోవడం జరిగింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయమే మహేష్ బాబు తల్లి ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఇందిరా దేవి గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.

ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య కాగా, కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019లో మరణించిన విషయం తెలిసిందే. ఇక కృష్ణ భార్యకు సంతాపం తెలియజేయడానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. అందుబాటులో లేని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

తన ముందే ఇద్దరు భార్యలు మరణించడం, పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మరణించడం. సూపర్ స్టార్ కృష్ణకు జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ సమయంలో ఆయనను ఓదార్చడం కూడా కష్టంగా మారింది. ఇక మహేష్ బాబు పరిస్థితి కూడా అంతే. కొంతకాలం క్రితమే అన్న చనిపోవడం. హఠాత్తుగా తల్లి మరణం తో జీర్ణించుకోలేకపోతున్నారు.