Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని అమితంగా ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఒక వైపు సినిమా ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అంత క్రేజ్ ఈయనకు ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ని కేవలం అభిమాన నాయకుడు నటుడిగా మాత్రమే కాకుండా భక్తుడిగా కొలిచేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ ముందు వరుసలో ఉంటారు.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన వెంటనే స్పందిస్తూ తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పట్ల తనకున్నటువంటి భక్తిని మరోసారి బండ్ల గణేష్ బయట పెట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా స్టార్ హీరోలు అయినటవంటి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
తాను పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పులి మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమాల వల్ల 100 కోట్ల రూపాయలు నష్టాలను ఎదుర్కొన్నాను అని తెలిపారు. సంవత్సరంలో పూర్తి చేయాల్సిన ఈ సినిమాలను మూడు సంవత్సరాల పాటు తీయటం వల్లే నష్టాలు వచ్చాయని రమేష్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. సింగనమల రమేష్ గారు మీరు మీ సినిమా ప్లాన్ సరిగా చేసుకోలేదు. అది మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.