ఖయ్యూం క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటుడు ఆలికి తమ్ముడు గా అందరికీ సుపరిచితమే. ఖయ్యూం రాజమండ్రిలో జన్మించారు. ఈయన తండ్రి మహమ్మద్ భాష టైలరింగ్ పని కొనసాగించేవారు. 2015లో అర్ష కమల్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె సంతానం. ఖయ్యూం దాదాపు 90 కి పైగా సినిమాలలో సహాయక పాత్రలలో నటించాడు.
ఖయ్యూం 1991 లో వచ్చిన స్వాతి కిరణం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తనకు 9 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడని, ఆ కుటుంబ భారం అంతా తన అన్న ఆలీ చూసుకునేవాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు తండ్రి లేని లోటు ఆలీ తీర్చేవాడని అన్ని సమకూర్చి ఎంతో ప్రేమగా చూసుకునేవాడని ఖాయ్యుం ఒక మీడియా సమావేశంలో చెప్పాడు.
అంతేకాకుండా ఆలీ భార్య తనను సొంత తమ్ముడు లాగా చూసుకున్నదని తన వదిన వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పుకొచ్చాడు. ఇంట్లో మొత్తం బాధ్యతలు వదిన చూసుకునేవారని ఆమె మా ఇంటికి పెద్ద కోడలుగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పాడు. ఈమధ్య తన తల్లి కూడా మరణించడం తనకు చాలా బాధగా ఉందని కాస్త ఎమోషనల్ అయ్యాడు.
అడపాదడపా వచ్చే అవకాశాలతో తనకంటూ పేరు, గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు వచ్చిన తన నటనతో, అమాయకత్వంతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేవాడు. సినిమాలో ఈయన కనిపిస్తే ఈయన నటనకు నవ్వకుండా ఉండడం చాలా కష్టం. ఇలా తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు.
ఇంట్లో చిన్న కుమారుడు కావడం వల్ల అందరూ బాగా చూసుకునేవారని ఎలాంటి కష్టాలు బాధలు తన వరకు రాకుండా తల్లి ఇంకా అన్న చూసుకునేవారని తర్వాత వారికి తోడు వదిన కూడా బాధ్యతలు చూసుకోవడంపై వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాను అంటూ ఒక మీడియా సమావేశంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు ఖయ్యూం.