హిందువుల మనోభావాలను గాయపరిచే కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. అవి యాదృచ్చికంగా జరుగుతున్నాయా లేక వాటివెనుక కుట్ర ఉన్నదా అనేది దర్యాప్తు జరిగితే తెలుస్తుంది. అంతర్వేది పుణ్యక్షేత్రంలో మొన్న జరిగిన రధ దహనం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిని సాకుగా తీసుకుని మతకలహాలు రెచ్చగొట్టాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ప్రయత్నించాయి అనే ఆరోపణ వైసీపీ నుంచి వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దైవాపచారాలు జరగడం ఇదే తొలిసారి కాదు. చంద్రబాబు పాలనలో ఇంతకన్నా ఘోరాలు జరిగాయి.
పరమ పవిత్రమైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయి. పుష్కరాల పేరుతో చంద్రబాబు ప్రచార పిచ్చికి ఇరవై తొమ్మిది మంది భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా పుష్కరాల పేరుతో నలభై ఆలయాలను బుల్డోజర్లతో కూల్చి వేశారు చంద్రబాబు అనే అపవాదు ఉందనే ఉంది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే అయిదు వందల ఏళ్ల చరిత కలిగిన శ్రీవారి ఆలయం ముందున్న వెయ్యికాళ్ల మంటపాన్ని కేవలం వ్యాపారం కోసం కూల్చివేయించారు అనే ఆరోపణ కూడా ఉంది.
అయితే అంతర్వేది వ్యవహారం లో మాత్రం తక్షణ చర్యలు తీసుకుని ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేశారు జగన్. రధాన్ని తగులబెట్టడం వెనుక రహస్యాన్ని ఛేదించడానికి ఏకంగా సిబిఐ విచారణను కోరాలని నిర్ణయించడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లకు ఒకేసారి జగన్ తాళం వేసినట్టు అయ్యింది అని వైసీపీ .. కాదు ఇది మా గెలుపు అని జనసేన – బీజేపీ లు .. జగన్ తప్పు ఒప్పుకున్నాడు అని టీడీపీ వాదిస్తున్నాయి .
మా “తెలుగు రాజ్యం” సైట్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, ఓటు రూపకంలో మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”5″]