అమరావతిపై మంత్రి కొడాలి నాని తాజా వ్యాఖ్యలతో చెలరేగిన రగడకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుల్ స్టాప్ పెట్టదలిచారా?…లేక ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తమకు సమస్యాత్మకంగా పరిణమించిన అమరావతి అంశాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేసేందుకు సరి కొత్త వ్యూహం మొదలు పెట్టడం, దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేపనిలో ఉన్నారా?…
బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లా భారీ ఆదాయాన్ని సంపాదించే నగరాన్ని నిర్మించాలన్న గత సిఎం చంద్రబాబు చేపట్టిన అమరావతి మహానగర నిర్మాణం గురించి మీ ఆలోచన ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా సిఎం జగన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణా,ఎపిగా విడిపోయినప్పుడు హైదరాబాద్ కోల్పోవడం ద్వారా నవ్యాంధ్రకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా ఒక నూతన రాజధానిని… రాష్ట్రానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టే ఒక గొప్ప క్యాపిటల్ సిటీని నిర్మించాలని, అందుకు అమరావతిని నిర్మించనున్నట్లు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సిఎం జగన్ గుర్తుచేశారు. అయితే ఆదాయాన్ని ఆర్జించే గొప్ప రాజధాని నిర్మాణం అనే కాన్సెప్ట్ ను సిఎం జగన్ ఒక వికృత ఆలోచన(పర్వెర్టెడ్ థింకింగ్) గా అభివర్ణించారు. గొప్ప నగరాలు నిర్మాణం వల్ల భారీ ఆదాయాన్ని ఆర్జిస్తామనే గ్యారెంటీ లేదని, పైపెచ్చు అలాంటి వాటి వల్ల అప్పుల్లో కూరుకుపోతామని సిఎం జగన్ తేల్చేశారు.
మా “తెలుగు రాజ్యం” సైట్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, ఓటు రూపకంలో మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”4″]