వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం డిసెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ప్రతి పక్షాల నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు అనేది వైసీపీ వాదన .
రైతుకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షన్ వాదన వేరేలా ఉంది. జీతాలు , పెన్షన్ లు కూడా ఇవ్వలేకపోతున్న ఏపీ సర్కార్ , అప్పులలో నిండా ముంగిపోయి ఉన్న ఏపీ సర్కార్ రైతులకి ఉచిత కరంట్ ఎగ్గొట్టే ఆలోచనతోనే ఈ విధానం తీసుకొచ్చింది అనీ అంటున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ లో లేని ఈ ఐడియా ఏపీ లో ఎందుకు అంటున్నారు వారంతా.
అయితే టీడీపీ మరొక కొత్త యాంగిల్ చూపిస్తోంది ఈ వ్యవహారం లో. ‘ త్వరలో ఏపీ లో కరంట్ మరియూ ఇతర అంశాలు , ప్రైవేట్ సెక్టార్ కి అప్పగిస్తారు ‘ అనేది ఖచ్చితంగా కొత్త యాంగిల్. విద్యుత్ పంపిణీ పూర్తిగా ప్రైవేటుపరం చేయబోతున్నారు అనేది వినపడుతున్న మాట. పంపిణీ ప్రైవేటుపరమైతే కొత్త తలనొప్పులు ఉండవు అనీ ,సబ్సిడీల భారం క్రమంగా తగ్గించే చాన్సు ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచనగా , కుట్రగా టీడీపీ చెబుతోంది ..
“తెలుగు రాజ్యం” ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”3″]
[yop_poll id=”4″]