అమరావతి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు వార్తల్లో లేని రోజు లేదు. నవ్యఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా చంద్ర బాబు హయాంలో రాజసం ఒలకబోసిన అమరావతికి వైయస్ జగన్ హయం లో స్మశాన వైరాగ్యం ఆవహించింది.
ఇందుకు కారణం లేకపోలేదు. చంద్ర బాబు మూడు ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశం కాబట్టి అమరావతి ని రాజధానిగా ప్రకటించామంటే వైయస్ జగన్ మాత్రం మూడు ప్రాంతాలు వారు ఇక్కడికే ఎందుకు రావాలి మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇచ్చేదం అని మూడు రాజధానులు ప్రకటించారు.
రాజధాని మార్పుకు వైస్సార్సీపీ చెబుతున్న ప్రధాన కారణం రాష్ట్రం లోటు బడ్జెట్లో వుంది కాబట్టి రాష్ట్ర ఆదాయాన్నంతా తెచ్చి అమరావతి నిర్మించలేమని. దానికి తోడు ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి మునిగిపోతుందని, ఒక రాజధాని ఉండడానికి ఇది అనువైన ప్రదేశం కాదనేది వారి వాదన.
అయితే తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు కూడా దీనికి ధీటుగా స్పంధిస్తూ అమరావతి లో వర్షాలకు అసలు నీళ్ళే నిలబడడం లేదని అదంతా కేవలం వైసీపీ అనుకూల మీడియా , సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెలుగురాజ్యం ప్రయత్నిస్తుంది. కింద పోల్ లో మీ ఓటు వేసి మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”12″]