22 ఏళ్ల దళిత కుర్రాడు పర్రి శ్రీకాంత్ కి ప్రముఖ సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన అమానుషమైన ఘటన ఆంధ్ర రాష్ట్రంతో పాటు యావత్ భారత దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎంతో అమానవీయంగా నలుగురు ఆడవారు, ఇద్దరు మగ వారు కలిసి ఐదు గంటలపాటు శ్రీకాంత్ ని హింసించారు. ఇక ఏడవ వ్యక్తి వచ్చి అతనికి శిరోముండనం చేసే వరకూ ఈ ఆరుగురు అతనిని వదిలి పెట్టలేదు. వారిలో ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ వారు అయితే శ్రీకాంత్ ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉండగా మిగిలిన వారు సోఫాలో కూర్చుని వేడుక చూశారు. ఇద్దరు మొబైల్ ఫోన్ లో జరిగింది మొత్తం రికార్డు చేశారు. ఇంత ఘోరమైన సంఘటన ఈ 21వ శతాబ్దంలోనే జరిగింది.
[yop_poll id=”2″]
పూర్తి వివరాల్లోకి వెళితే…
నూతన్ నాయుడు భార్య మధుప్రియకు చెందిన ఐఫోన్ కనబడకుండా పోయింది. ఆమె, ఆమె యొక్క బ్యూటీషియన్ ఇందిర, ఇక ఇంట్లో పనిచేసే మిగతా వారు శ్రీకాంత్ పైన అనుమానపడ్డారు. ఆగస్టు 1వ తేదీన నూతన్ నాయుడు ఇంట్లో ఉద్యోగం మానివేసిన శ్రీకాంత్ నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లో పనికి చేరాడు. పదవ తరగతి వరకు చదువుకున్న శ్రీకాంత్ శ్రీకాకుళం నుండి వైజాగ్ కు వలస వచ్చాడు. నగరంలో ఎక్కువ డబ్బు అర్జించి తన అమ్మమ్మని, చెల్లిని బాగా చూసుకుందామని అనుకున్నాడు. ఇకపోతే ముందుగా అతన్ని ఇంటికి పిలిచి ఐఫోన్ విషయమై విచారించారు. తనకు ఏమీ తెలియదని…. తాను నిర్దోషినని చెప్పిన శ్రీకాంత్ వారికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సూచించాడు.
పక్క రోజు మధ్యాహ్నం అతనికి 1:00 సమయంలో నూతన్ నాయుడు భార్య మధుప్రియ నుండి ఫోన్ వచ్చింది. అతను విషయం ఏమిటో కనుక్కునేందుకు వారి ఇంటికి వెళ్లగా సౌజన్య, మధుప్రియ, ఇందిర, ఝాన్సీ, బాలు, వరహాలు ఉన్నారు. వారంతా కలిసి ఆరు గంటల వరకు శ్రీకాంత్ ని హింసించడం మొదలుపెట్టారు. ముగ్గురు అయితే అతని కొడుతుండగా మిగతా వారు దీన్ని ఫోన్లలో చిత్రీకరించారు. ఐఫోన్ ఎక్కడ దాచావంటూ అతనిని నిలదీశారు. శిరోముండనం జరిగిన తర్వాత గాని అతన్ని వదిలి పెట్టలేదు.
ఈ విషయం బయటకు చెబితే అతనిని ఫోన్ లో వాట్సాప్ కెమెరాల్లో అమ్మాయిల వీడియోలు తీసుకున్నట్లుగా గుర్తించి శిరోముండనం చేసినట్లు చెబుతామని మహిళలు బెదిరించడం గమనార్హం.
మొత్తానికి ఈ సంఘటన జరిగే సమయం మొత్తంలో నూతన్ నాయుడు అక్కడ లేకపోయినా.. అతని పాత్ర ఏమిటి అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే అయిదు గంటల పాటు తన ఇంట్లో ఆరుగురు ఒక యువకుడిని హింసిస్తుంటే.. అతనికి తెలియకుండానే ఇదంతా జరిగి ఉంటుందా? నూతన్ నాయుడు ఆ ప్రాంతంలో బాగా పేరుమోసిన రాజకీయవేత్త. 1 కి 4 పార్టీలతో అతనికి సంబంధం ఉందంటే మామూలు విషయం కాదు. ఒకసారి టీడీపీ అనుకూల నూతన్ నాయుడు మనకి కనిపిస్తాడు. మరొకసారి పవన్ కళ్యాణ్ అభిమాని అని జనసేనకు పనిచేస్తుంటాడు. ఇంకోసారి వైసిపికి అనుకూలంగా తను మొదట్లో పనిచేశానని వారి పార్టీలో కీలక పాత్ర పోషించారని చెప్పాడు. 2014లో జై సమైక్యాంధ్ర తరఫున పోటీ చేశాను అని అంటాడు. ఇక నూతన్ నాయుడుకి ఉన్న రాజకీయ పార్టీల మద్దతు వీరందరి చేత ఈ పని చేయించిందని.. అందుకు ధైర్యాన్ని ఇచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.
2019లో ఎన్నికల్లో టిడిపి తరఫున లగడపాటి తో కలిసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నూతన్ నాయుడు పనిచేయగా 2014 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అందుకు ముందు రెండు ఏళ్ళ పాటు వైసీపీలో తెరవెనుక పనిచేశానని.. పార్టీ సిద్ధాంతాలు, అజెండా రూపొందించే టీంలో పని చేసినట్లు వెల్లడించారు.
అయితే తర్వాత జనసేన అభిమానిగా మారిపోయిన అతను పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తీసిన ‘పవర్ స్టార్’ సినిమాకు ప్రతీకారంగా ‘పరాన్న జీవి’ అనే సినిమాను వర్మ పై వదిలారు. ఇదంతా పక్కన పెడితే నూతన్ నాయుడు ఇంట్లో దొరికిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేసిన పోలీసులు అంతసేపు బాధితుడు శ్రీకాంత్ కి జరిగిన దారుణాన్ని చూసి చలించిపోయారు. అతనిని కర్రలతో రాడ్లతో ఆ ఇంటి వారు కొట్టి హింసించారు. అతనికి శిరోముండనం చేసేవరకు వదల్లేదని అన్నారు. అతనికి శిరో ముండనం చేసిన క్షురకుడితో పాటు అక్కడ ఉన్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
నూతన్ నాయుడు విషయం గురించి రాష్ట్రం మొత్తం వైరల్ అవుతోంది.