Ntr: పొరపాటున కూడా నా నోటి నుంచి జోహార్ ఎన్టీఆర్ అనే మాట రాదు… వైవిఎస్ చౌదరి సంచలన వ్యాఖ్యలు!

Ntr: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నందమూరి కుటుంబానికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు అలాంటి వారిలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పని చేశారు. అయితే ఇటీవల కాలంలో వైవి ఎస్ చౌదరి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇలా చాలా రోజుల తరువాత ఈయన మరో నందమూరి వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమాని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్లోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో నందమూరి తారక రామారావు కొడుకులు కుమారులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఇలా నందమూరి నాలుగో తరాన్ని వైవిఎస్  చౌదరి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

ఇలాంటి తరుణంలోనే వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ సీనియర్ నటుడు తారక రామారావు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నందమూరి తారక రామారావు గారు ఉన్న ఈ స్థలం నాకు ఒక దివ్య పుణ్యక్షేత్రం లాంటిది నా ముందు జనరేషన్ నా జనరేషన్ నా తదుపరి జనరేషన్ లాంటి వారికి ఒక అద్భుతమైన మెడిటేషన్ లాంటిది. ఇక్కడికి వస్తే మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.

ఇది ఒక శక్తినిచ్చే ప్రదేశం. ఇక్కడికి వస్తే ఆయన మనతోనే ఉన్నారనే భావన కలుగుతుంది ఇలాంటి ఒక గొప్ప స్థలంలో నా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఎన్టీఆర్ జోహార్ అనే పదం అసలు రాదని తెలిపారు. ఆయన చనిపోలేదు మనలోనే మనతోనే ఉన్నారు తెలుగుజాతి బ్రతికున్నన్ని రోజులు తారక రామారావు గారు బ్రతికే ఉంటారు అంటూ ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ పై ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు.