2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోగా మారారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన చాలామంది కేవలం జగన్ పేరుతో మాత్రమే గెలిచారు. ఎన్నికల సమయంలో వైసీపీలో కేవలం జగన్ మాత్రమే హీరో అనుకున్నారు. కానీ వైసీపీలో జగన్ తో పాటు మరో హీరో ఉన్నారు. కానీ ఆ హీరో పేరు ఎప్పుడు బయటకు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీలో ఉన్న మరో హీరో పేరు బయటకు వచ్చింది. ఆయనే వైవి సుబ్బారెడ్డి. ఆయన 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ చేసిన రాజకీయాలను నడిపించారు. అయితే ఇప్పుడు ఆయన వైసీపీలో చాలా ఇబ్బందులను సృష్టిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఆయనే హీరో అంటున్నారు.
మొదట వద్దన్నా ఇప్పుడు ఆయనే హీరో
గత ఎన్నికల ముందు వరకు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా చక్రం తిప్పారు. అయితే.. ఆయనపై తీవ్ర వివాదాలు, విమర్శలు రావడంతో జిల్లా నేతల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జగన్ ఆయనను తప్పించారు. ఎంపీ సీటు కోసం ఆయనఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరుకు కుటుంబ సభ్యులతో చెప్పించినా అలిగి కొన్నాళ్లు దూరంగా ఉన్నా.. జగన్ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. సీటు దక్కలేదు. ఈ క్రమంలోనే ఆయనను రాజకీయాలతో సంబంధం లేని టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని జగన్ హీరో చేశారు.
వైవి సుబ్బారెడ్డినే హీరో
2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డిని దూరం పెట్టినా ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వ్యవహారా ల ఇంచార్జ్‌గా ఉన్నారు. పైకి ఒక జిల్లాకే ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. దాదాపు ప్రకాశం, గుంటూరు, కృష్ణా వ్యవహారాలను కూడా ఆయనే చూస్తున్నారు. రెండు రోజుల కిందటద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మాజీ మంత్రి బోస్‌పై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్.. విషయన్ని వైవీకి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇక, గుంటూరులోనూ ఇలాంటి వివాదమే వచ్చింది. దీంతో ఈ విషయాన్ని కూడా వైవీ కి చెప్పాలనే అన్నారట. మొత్తంగా చూస్తే. పైకి టీటీడీ బోర్డు చైర్మన్‌గా చక్రం తిప్పుతున్నా.. వైవీ ఇప్పటికీ వైసీపీ హీరోనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వైసీపీ నడిపించే కీలక నేతల్లో వైవి సుబ్బారెడ్డి కూడా ఉండనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.